Ammayi garu Serial Today May 21st: అమ్మాయి గారు సీరియల్: సందడిగా సూర్య, విరూపాక్షిల పెళ్లి రోజు వేడుక.. విరూపాక్షిని శాశ్వతంగా గెంటేయాలని తల్లీకొడుకుల ప్లాన్!
Ammayi garu Today Episode పెళ్లి రోజు వేడుక జరగకూడదని విరూపాక్షిని శాశ్వతంగా గెంటేయాలని తల్లీకొడుకులు ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీ కోసం విరూపాక్షితో కలిసి పెళ్లి రోజు జరుపుకోవడానికి సూర్యప్రతాప్ ఒప్పుకుంటాడు. అందరూ చాలా సంతోషిస్తారు. రుక్మిణి బంటీకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. బావగారు రేపు సెలబ్రేషన్స్‌లో మీ సపోర్ట్ ఉండాలి అని రుక్మిణి అంటే కచ్చితంగా చేస్తాను అని రాజు అంటాడు.
దీపక్ తల్లితో ఇన్నేళ్లు ఎవరు తలచుకున్నా జరగని పని ఇప్పుడు ఈ రుక్మిణి తలచుకోగానే అయింది. ఎలా అయినా ఈ పెళ్లి రోజు ఆపాలి అని దీపక్ అంటాడు. కచ్చితంగా ఆపాలి దీపక్ అని విజయాంబిక అంటుంది. అందుకు ఓ ప్లాన్ ఆలోచిస్తుంది. ఉదయం రాజు, రూప (రుక్మిణి)లు మాట్లాడుకుంటారు. దీపక్, విజయాంబికలు ఏమైనా చేస్తారని అనుకుంటారు. ఇద్దరూ పెళ్లి రోజులు బట్టలు తీసుకొచ్చి రూప తల్లికి ఇవ్వడానికి రాజు సూర్యప్రతాప్‌కి ఇవ్వడానికి వెళ్తారు. సూర్యప్రతాప్ విరూపాక్షి, రాఘవ తప్పు చేశారని అనుకొని ఆ నాటి ఘటన గుర్తు చేసుకుంటాడు. ఆలోచిస్తూ కూర్చొని ఉంటే రాజు వెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దయ్యా అని చెప్తాడు. రెడీ అయి రమ్మని ఎందుకు రాజు ఇది నాకు కష్టమైన పని బంటి కోసం మాత్రమే వస్తున్నా అంటారు. భార్య పోయిన బాధలో నువ్వు ఉంటే నా సర్వం పోగొట్టిన భార్యతో నేను పెళ్లి రోజు జరుపుకోవడం ఏంటి అని అంటాడు.
రూప తల్లికి విష్ చేసి చీర ఇస్తుంది. ఇది తనకు సంతోషంగా లేదని సూర్యప్రతాప్ సంతోషంగా ఇష్టంగా జరుపుకున్నప్పుడే అసలైన సంతోషం అని ఇప్పుడు కేవలం బంటి కోసమే మాత్రమే ఒప్పుకున్నాడని విరూపాక్షి చెప్పి బాధ పడుతుంది. తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని రుక్మిణి తల్లికి చెప్తుంది. మరోవైపు విజయాంబిక దీపక్‌తో తాను చెప్పిన వ్యక్తి కచ్చితంగా టైంకి వస్తాడా అని మాట్లాడుకుంటారు. కచ్చితంగా వస్తాడు నువ్వు ఊహించిన దాని కంటే పది రెట్లు ఎక్కువ అవమానం అత్తయ్యకు ఉంటుంది. శాశ్వతంగా మనకు తనకు బంధం తెగిపోతుందని అంటాడు.
సూర్యప్రతాప్, విరూపాక్షి రెడీ అయి వస్తారు. బంటి వెళ్లి ఇద్దరికీ విష్ చేసి వాళ్ల చేతులు పట్టుకొని కిందకి తీసుకొస్తాడు. రుక్మిణి ఇద్దరికీ హారతి ఇస్తుంది. తర్వాత సూర్యప్రతాప్ విరూపాక్షి నుదిటిన కుంకుమ పెడతాడు. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. విరూపాక్షి కూడా సూర్యప్రతాప్‌కి కుంకుమ పెడుతుంది. ఇద్దర్ని మొదటి సారి చూస్తున్నా అని రుక్మిణి దీవించమని అంటుంది. వెంటనే రాజు కూడా వెళ్లి దీవించమని అంటాడు. బంటీ కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. తర్వాత ఇద్దరి పెళ్లి ఫొటో వేయించిన కేక్ తీసుకొచ్చి రాజు సర్‌ఫ్రైజ్ చేస్తాడు. అది చూసి విరూపాక్షి సంతోషిస్తే సూర్యప్రతాప్ మాత్రం రాఘవని గుర్తు చేసుకొని కోపంగా ఉంటాడు. సూర్యప్రతాప్ అందరితో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ మనిషితో కలిసి బతకను కేవలం బంటీ కోసమే ఇలా ఒప్పుకున్నా అ ని చెప్తాడు.
బంటీ తాతయ్యతో హ్యాపీగా ఉన్న ఫంక్షన్‌లో ఇవన్నీ ఎందుకు ముందు కేక్ కట్ చేయండి అంటాడు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయండి అని బంటీ చెప్తాడు. దాంతో విరూపాక్షి సూర్యప్రతాప్ చేయి పట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. రాజు, రూపలు చాలా సంతోషిస్తారు. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటారు. రూప ఫొటోలు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!





















