Ammayi garu Serial Today March 15th: అమ్మాయి గారు సీరియల్: తల్లికి ఇంజెక్షన్ వేసేసిన దీపక్.. పిచ్చిదైపోయిన విజయాంబిక!
Ammayi garu Today Episode దీపక్ హోళీ వేడుకలో మందారాన్ని చంపాలని తల్లి ప్రాణాల మీదకు తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప విజయాంబిక ముఖం మీద రంగులు పోసి హ్యాపీ హోళీ అని నవ్వుతుంది. రాజు మందారం వాళ్ల మీద విసిరేసి వెళ్లిపోతారు. దీపక్ కూడా అక్కడికి వస్తాడు. ఎవరో ఒకర్ని చంపే పోతానని ఇంజక్షన్ పట్టుకొని వస్తాడు.
రాజు, రూపలు విరూపాక్షి, సూర్యప్రతాప్ చుట్టూ హోళీ అడుతారు. ఇద్దరూ కావాలని సూర్యప్రతాప్, విరూపాక్షిని నెట్టేస్తారు. ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకొని పట్టుకుంటారు. ఇద్దరూ తమ ప్రేమ పెళ్లిని గుర్తు చేసుకుంటారు. దీపక్ తల్లి దగ్గరకు వెళ్తాడు. తల్లిని కలిసి ఎవరో ఒకర్ని ఈరోజు చంపేస్తానని వెళ్తాడు. ముందు రాజుని చంపేస్తానని అంటాడు. హోళీ ఆడుతూ రూప రాజు ఒకరి మీద ఒకరు పడిపోతారు. విరూపాక్షి, సూర్యలు రూప దగ్గరకు వెళ్తారు. అందరూ ఇద్దరినీ పైకి లేపి పరామర్శిస్తారు. సూర్య ప్రతాప్ రూపతో ఆడింది చాలు ఇక ఉట్టి కొట్టడానికి పదండి అంటారు. అందరూ ఉట్టి కొట్టే కార్యక్రమానికి వెళ్తారు. సూర్యప్రతాప్‌కి ఉట్టి కట్టమంటే వద్దని అంటాడు. విరూపాక్షికి కొట్టమంటే తనకు తెలీదు అంటుంది. దాంతో రాజు ఇద్దరి తరఫున మీరు కొట్టిండి అని రూపకి చెప్తాడు. నా వల్ల కాదు అని రూప అంటే రాజు దగ్గరుండి మీరే కొడతారు అని పంపిస్తాడు. విజయాంబిక మౌనికకు సైగ చేయడంతో మౌనికి మందారాన్ని తీసుకొని నీరు కొట్టడానికి తీసుకెళ్తుంది.
రూప ఉట్టి కొట్టడానికి వెళ్తే మందారం, మౌనికలు నీరు చల్లుతారు. సూర్యప్రతాప్, విరూపాక్షికి చంపడం కుదరకపోవడంతో దీపక్ మందారాన్ని చంపాలి అనుకుంటాడు. ఇక రూపని రాజు ఎత్తుకొని ఉట్టి కొట్టిస్తాడు. ఆ సంతోషంలో రూపని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. దీపక్ ఇంజక్షన్ వేయడానికి మందారం దగ్గరకు వస్తాడు. రూప అది చూస్తుంది. షాక్ అయి తల్లికి పిలిచి సైగ చేస్తుంది. దాంతో దీపక్ మందారానికి పొడిచే టైంకి విరూపాక్షి విజయాంబికను తోసేస్తుంది. మందారానికి వేయాల్సిన ఇంజెక్షన్ దీపక్ విరూపాక్షికి వేసేస్తాడు. దీపక్ పారిపోతాడు. విజయాంబిక కింద పడిపోతుంది.
మత్తులో ఉన్న విజయాంబికను ఇంటికి తీసుకొస్తారు. ఇద్దరు కోడళ్లు మందారం కాళ్లు చేతులు రుద్దుతారు. డాక్టర్ వచ్చి చూసి ప్రాబ్లమ్ ఏం లేదు కాసేపట్లో లేచి కూర్చొంటారని అంటే దెయ్యంలా లేచి కూర్చొంటుంది. మౌనిక అత్తయ్య అంటే లాగిపెట్టి కొట్టి నేను అత్తయ్య ఏంటి నువ్వే అత్తయ్య అని చిన్న పిల్లలా చుక్ చుక్ అని ఇళ్లంతా పరుగులు తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరకదు. సుమ సూర్యతో ఎలక్షన్‌లో ఓడిపోవడంతో పిచ్చి పట్టినట్లు ఉందని అంటుంది. ఇక విజయాంబిక ఇద్దరి కోడళ్లని వెనక్కి పెట్టుకొని ట్రైన్ ఆట ఆడుతుంది. ఇక విజయాంబికను గదిలోకి అతి కష్టం మీద తీసుకెళ్లి బ్లెడ్ తీస్తారు. టెస్ట్‌లు చేస్తే విషయం తెలుస్తుందని అంటారు. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పి వెళ్లిపోతారు. మందారం సూర్యతో ఈ టైంలో దీపక్ బాబు ఉంటే బాగుండని అంటుంది. సూర్య చంద్రతో బెయిల్ తీసుకొని రమ్మని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!



















