Ammayi garu Serial Today August 11th: అమ్మాయి గారు సీరియల్: కోమలితో అసహ్యంగా ప్రవర్తించిన దీపక్.. తాట తీసిన తల్లి.. కోమలి లవర్‌ని చూసేసిన రాజు!
Ammayi garu Serial Today Episode August 11th కోమలితో దీపక్ మిస్ బిహేవ్ చేయడం విజయాంబిక కొడుకుని పచ్చడి చేసి కొట్టడం, కోమలి రాత్రి అశోక్‌ని కలవడం రాజు అది చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అందర్ని షాక్‌కి గురి చేస్తుంది. సూర్యప్రతాప్ కోమలితో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా కూతురు రూపే అని నేను నమ్ముతున్నా అని అంటాడు. రుక్మిణిలా ఉన్న అసలైన రూప బిత్తరపోతుంది. తాను తండ్రి ప్రేమకు దూరం అయిపోతున్నా అని బాధ పడుతుంది.
రాజు, రుక్మిణి, విరూపాక్షి బాధపడుతూ ఉంటారు. సంవత్సరం క్రితం మన మధ్య జరిగింది తనకు ఎలా తెలుసు రాజు అని రుక్మిణి అడుగుతుంది. మన మధ్య ప్రతీ విషయం ఆ అమ్మాయి తెలుసుకొని వచ్చిందని అంటాడు. మరోవైపు కోమలి దీపక్ దగ్గరకు పరుగున వెళ్లి చాలా ఎగ్జైట్ అవుతుంది. థ్యాంక్స్ దీపక్ నువ్వు లేకపోయి ఉంటే ఏమైపోయేదాన్నో అని కోమలి మాట్లాడుతుంటే దీపక్ కోమలిని కసిగా చూస్తుంటాడు. కోమలి వెనక్కి తిరిగి ఉండటంతో హగ్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇంతలో విజయాంబిక వచ్చి ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది. చివరి నిమిషంలో దీపక్ మెసేజ్ చేశాడు లేకపోతే ఈ గండం నుంచి నేను తప్పించుకునే వాడిని కాదని దీపక్ గుర్తు చేసుకొని మెసేజ్ చేశాడని ఆ మెసేజ్ చూసి చెప్పానని కోమలి చెప్తుంది. విజయాంబిక కొడుకుని ఆకాశానికి ఎత్తేస్తుంది.
విజయాంబిక కోమలితో ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి.. నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా గ్యాప్ తీసుకో మేం ఈ లోపు అన్నీ చెప్పేస్తాం అంటుంది. ఇక విరూపాక్షి రూప, రాజులతో ఇది కచ్చితంగా దీపక్, విజయాంబికల పనే వాళ్లే ఈ విషయం చెప్పుంటారు. కచ్చితంగా వాళ్ల అంతు చూడాలి ఆ అమ్మాయి డబ్బు కోసమే ఇదంతా చేసుంటుంది. ఏదో ఒక చోట దొరికి పోతుందని అని చెప్తుంది.
మరోవైపు కోమలి స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటే దీపక్ వెనక నుంచి కోమలిని చూసి వెనక నుంచి హగ్ చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేశా కానీ నన్ను నేను ఆపుకోలేకపోయాను అని అంటాడు. కోమలి దీపక్‌ని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. దీపక్ ఎగిరెళ్లి బెడ్ మీద పడతాడు. ఏరా కళ్లు నెత్తికెక్కాయా..ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావా అని చితక్కొడుతుంది. మా అమ్మ వచ్చేస్తుంది ప్లీజ్ అని బతిమాలుతాడు. నేను మందారం అనుకున్నాను అని దీపక్ అంటే నేను నీకు ఏ యాంగిల్లో మందారంలా కనిపించాను రా అని కొడుతుంది. మళ్లీ కొట్టబోతే విజయాంబిక వస్తుంది. డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చామని నా తమ్ముడి కూతురు అనుకుంటున్నావా తాట తీస్తా అని అంటే తాట తీయాల్సింది నీ కొడుకుకి అని అంటుంది. ఏం చేశావురా అని విజయాంబిక అంటే నేను చెప్తా అని కోమలి అంటుంది. చెప్పొద్దు అని దీపక్ బతిమాలుతాడు.
కోమలి విజయాంబికకు విషయం చెప్పి నీ కొడుకు ఓ కామకుక్క అని అంటుంది. విజయాంబిక దీపక్‌ని పచ్చడి పచ్చడి చేసి చితక్కొడుతుంది. దీపక్ కన్ను లొట్టపోయి ముక్కూ ముఖం ఏకమైపోయి కళ్లు కూడా కనిపించకుండా పడుంటాడు. దీపక్‌ని చూస్తే నవ్వాగదు. జరిగింది జరిగిపోయింది ఇక పని చూసుకో అని కోమలిని విజయాంబిక అంటే నన్ను ముట్టుకున్న వాడిని వదిలేయలా అంటుంది. నీ ఆత్మ గౌరవం చల్లారకపోతే అని దీపక్‌ని లేపి తన కాళ్ల మీద పడి క్షమాపణ అడగమని చెప్తుంది. దీపక్ క్షమాపణ అడుగుతాడు. అదంతా మందారం చూస్తుంది. ముగ్గురు షాక్ అయిపోతారు.
మందారం వచ్చి దీపక్ బాబుని ఎందుకు చావ గొట్టారు అని అడుగుతుంది. దీపక్ ముఖం దాచుకొని కాలి జారి పడ్డాను అంటాడు. ఇక మందారం కోమలితో నువ్వు మా అమ్మాయిగారు కాదని అందరికీ తెలుసు ముఖ్యంగా మా రాజన్నకి తెలుసు. తెలిసినా సైలెంట్‌గా ఉన్నాడు అంటే పెద్ద ప్లానే చేస్తున్నాడని అర్థం. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. రాజు బయట కోమలి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కోమలికి ఓ ఫోన్ వస్తుంది.కోమలి చాలా సంతోషంగా మాట్లాడి అక్కడే ఉండు వస్తున్నా అని చెప్పి బయటకు వెళ్తుంది. కోమలి ఎవరికీ కనిపించకుండా సీక్రెట్‌గా వెళ్లడం రాజు మేడ మీద నుంచి చూసి పరుగులు తీస్తాడు. కోమలి బయటకు వెళ్లి అశోక్ అనే వ్యక్తిని కలుస్తుంది. అశోక్‌ని చూసి కోమలి హగ్ చేసుకోడం రాజు చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















