Ammayi garu Serial Today April 28th: అమ్మాయి గారు సీరియల్: దీపక్ వీక్‌నెస్‌ని పట్టుకున్న రాధిక బుద్దొచ్చేలా చేస్తుందా.. రూప, రాజుల ప్లానేంటి?
Ammayi garu Today Episode విజయాంబిక, దీపక్‌లకు సూర్యప్రతాప్‌కి ఆపద తల పెట్టారని తెలుసుకున్న రూప, రాజులు వాళ్లకి బుద్ధి వచ్చేలా చేయడానికి నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాధిక రూప, రాజులతో దీపక్, విజయాంబికలు సూర్యప్రతాప్‌ని చంపాలని చూశారని చెప్తుంది. వారికి తగిన బుద్ధి చెప్పాలని అంటుంది. అందుకు రాధిక ఓ ప్లాన్ చెప్తుంది. రాధిక చెప్పినట్లు చేయాలని అనుకుంటారు. రాధిక మనసులో రేపుంటుంది దీపక్ నీకు అని అనుకుంటుంది.
దీపక్, విజయాంబిక ఇద్దరూ కాలిన చేతులకు మందు రాసుకుంటూ రాధిక సూర్యప్రతాప్‌ని కాపాడిందని తిట్టుకుంటారు. అలాంటి కెమికల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. తమకు ఈ గది తీసుకొచ్చిన రాజు, రూపలకు దారుణంగా దెబ్బకొట్టాలని అనుకుంటారు. మరోవైపు సూర్యప్రతాప్ రూపకి ఉన్న గండం గురించి గుర్తు చేసుకొని నా బంగారు తల్లిని ఎలా అయినా కాపాడుకోవాలని అనుకుంటారు. ఇక రూప, రాజులు రాధిక చెప్పినట్లు దీపక్కి ఉన్న అమ్మాయిల పిచ్చితోనే దీపక్ అంతు చూడాలి అనుకుంటారు.
ఇంతలో వాళ్ల దగ్గరకు మందారం వస్తుంది. వాళ్లకి బుద్ధి రావడానికి నేను మీతో పాటే చేతులు కలుపుతాను అని ముగ్గురు దీపక్, విజయాంబికల గదిలోకి వెళ్తారు. ఎవరూ లేచినా ప్రాబ్లమ్ అవుతుందని ఎవరూ చూడకుండా వెళ్లి పని పూర్తి చేయాలి అనుకుంటారు. దీపక్, విజయాంబిక పడుకొని ఉంటే వెళ్లి దీపక్ ఫోన్ తీసుకుంటారు. ఇక సూర్యప్రతాప్ రూపని వెతుక్కుంటూ గదిలోకి వెళ్తారు. రూప గదిలో లేకపోవడంతో ఇళ్లంతా వెతుకుతుంటారు. ఇక రూప దీపక్ ఫోన్ దీపక్ ఫ్రింగర్ ఫ్రింట్ పెట్టి అన్ లాక్ చేస్తుంది. ఇంతలో సూర్యప్రతాప్ రూప వాళ్లని వెతుక్కుంటూ దీపక్ వాళ్ల గదికి రావడంతో రూప, రాజు, మందారం దాక్కుంటారు. సూర్యప్రతాప్ వెళ్లి పోతారు.
రూప రాజుకి మెసేజ్ చేస్తుంది. రూప, రాధికలు దీపక్ ఫోన్ నుంచి చాటింగ్ చేస్తారు. మళ్లీ ఫోన్ పెట్టేసి రూప వాళ్లు బయటకు వెళ్తారు. మందారాన్ని పంపేసి రూప తండ్రిని పిలుస్తుంది. సూర్యప్రతాప్ రూపని చూసి ఎమోషనల్ అయిపోతాడు. రూప విషయంలో ఏం కంగారు పడొద్దని నేను ఉండగా ఏం కాదని రాజు ధైర్యం చెప్తాడు. రూపని మనం ఎలా అయినా కాపాడుకోవాలని అంటాడు.
ఉదయం రాధిక సూర్యప్రతాప్ గారు సూర్యప్రతాప్ గారు అని పిలుస్తూ ఇంటికి వస్తుంది. మందారం, రూప, రాజులు ప్లాన్ వర్కౌట్ అవుతుందని నవ్వుకుంటారు. అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఏమైందని రాధిక అని సూర్యప్రతాప్ అంటారు. దానికి రాధిక మీ లాంటి గొప్ప కుటుంబంలో నీచమైన కలుపు మొక్కలు ఉంటాయని అనుకోలేదని అంటుంది. మీ దగ్గర చెప్పడానికి సిగ్గుగా ఉందని అంటుంది. ఏమైందో చెప్పమని రూప అడుగుతుంది. అందరూ అడుగుతారు. ఏమైనా చేశావారా అని విజయాంబిక దీపక్‌ని అడుగుతుంది. నేనేం చేయలేదు అని దీపక్ అంటాడు.
రాధిక సూర్యప్రతాప్‌తో తనకు భర్త లేడుని తెలిసే నాతో తప్పుగా మాట్లాడుతున్నాడని అంటుంది. అందరూ దీపక్‌ని అనుమానం చూస్తే నేను కాదు మామయ్య అని చెప్తాడు. బాబు ఉన్నాడు అని చెప్తున్నా వినకుండా నా బాబుకి అతను బాబు అవుతాను అని మళ్లీ నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడని చెప్తుంది. దీపక్ గతంలో తానే రాధికకు అలా అనడం గుర్తు చేసుకుంటాడు. అందరూ దీపక్‌నే చూస్తారు. దీపక్ మళ్లీ నేను కాదు అంటాడు. రాత్రి పగలు తేడా లేకుండా కలుద్దామని మెసేజ్‌లు చేస్తున్నాడు అవసరం అయితే తన భార్యని చంపి అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్తుంది. విజయాంబిక కూడా దీపక్‌నే అంటుంది. రూప రాధికతో మీరు చెప్పే అంత నీచులు మా ఇంట్లో ఎవరూ లేరని అంటుంది.
సూర్యప్రతాప్ దీపక్‌ని పిలిచి ఈ తప్పు నువ్వేమైనా చేశావా అంటాడు. దానికి దీపక్ నేనే చేయలేదు నేనేం చేసుంటే మీరు ఏ శిక్ష వేసినా ఒకే అంటాడు. విజయాంబిక కూడా కొడుకుని చితక్కొడతా వారం తిండి పెట్టను అని అంటుంది. తనకు మెసేజ్‌లు చేసింది ఈ దీపక్‌నే అని రాధిక అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. దీపక్ ఇంటికి వచ్చి లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని చెప్తుంది. మందారం ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని రూప అడుగుతుంది. ఉన్నాయి అని రాధిక ఉంగరం చూపిస్తుంది. తల్లీకొడుకులు నోరెళ్ల బెడతారు. నక్లెస్ కూడా చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















