Hyper Aadi - Ram Prasad: ఎవరూ ప్రెజర్ చేయరు, అవన్నీ అబద్దాలే - కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై కౌంటర్ ఎటాక్!
ఆర్ఫీ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్.
![Hyper Aadi - Ram Prasad: ఎవరూ ప్రెజర్ చేయరు, అవన్నీ అబద్దాలే - కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై కౌంటర్ ఎటాక్! Aadhi, Ram Prasad slams RP comments Hyper Aadi - Ram Prasad: ఎవరూ ప్రెజర్ చేయరు, అవన్నీ అబద్దాలే - కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై కౌంటర్ ఎటాక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/d50e85e9d6a95e67c2b0fff6945079741657453163_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రీసెంట్ గా కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థ, 'జబర్దస్త్' షోలపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మల్లెమాల సంస్థ తమను కుక్కలా, 'కెజియఫ్'లో బానిసల్లా చూశారని, సరైన భోజనం పెట్టలేదని, ఉదయం వండిన అన్నం సాయంత్రం పులిహోర చేసి పెట్టేవారని... భోజనం సరిగా లేకపోవడం కూడా 'జబర్దస్త్' షో మానేయడానికి ఒక కారణమని ఒక ఇంటర్వ్యూలో 'కిరాక్' ఆర్పీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే సుధీర్,రష్మీ లకు పెర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేశారని అన్నారు.
ఆర్ఫీ చేసిన ఈ కామెంట్స్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్. ఆర్పీ చేసిన ఒక్కో ఆరోపణని డిఫెండ్ చేస్తూ మాట్లాడారు ఆది, రామ్ ప్రసాద్ లు. ప్రొడ్యూసర్స్ కి చాలా పనులు ఉంటాయని.. రోజూ సెట్స్ కి వచ్చి కూర్చోరని.. వారి బాధ్యతగా కంటెస్టెంట్స్ కి అన్నీ ఎరేంజ్ చేసిన తరువాత సెట్స్ కి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కిరాక్ ఆర్పీ చెప్పినట్లు.. ప్రొడక్షన్ ఫుడ్ అంత చెత్తగా ఉండదని.. మల్లెమాల సంస్థ ఎవరినీ బానిసల్లా ట్రీట్ చేయదని స్పష్టం చేశారు.
'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన ఆర్పీ ఈరోజు అదే షోని తక్కువ చేస్తూ మాట్లాడడం.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నిర్మాత గురించి ఏకవచనంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. 'మల్లెమాల అమ్మ వంటిది.. జబర్దస్త్ అమ్మ లాంటిది' అని గతంలో ఆర్పీ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియోలను చూపించారు ఆది, రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ చూపించిన వీడియోలో.. కిరాక్ ఆర్పీ ఎమోషనల్ అవుతూ.. 'జబర్దస్త్' అమ్మలాంటిందని ఏడ్చేశాడు.
మల్లెమాల సంస్థ సుధీర్, రష్మీలకు పెర్సనల్ లైఫ్ లేకుండా చేసిందని చెప్పడం అబద్దమని.. ఆ షోలో ఎవరూ ఎవరినీ ఫోర్స్ చేయరని చెప్పారు. సుధీర్, రష్మీలకు టాస్క్ ఇలా చేస్తే వర్కవుట్ అవుతుందనిపిస్తే చేస్తారని.. అంతేకానీ మల్లెమాల వాళ్లు ఫోర్స్ చేస్తే కాదని చెప్పుకొచ్చారు. సుధీర్ ని అవమానించారని అనడం అబద్దమని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సుధీర్ ని పిలిచి ఆర్పీ చెప్పింది నిజమేనా..? అని అడిగితే కచ్చితంగా అబద్ధమని చెబుతాడని అన్నారు.
'జబర్దస్త్' షో నుంచి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ లాంటి వాళ్లు బయటకు వెళ్లడానికి సినిమాలే కారణమని అన్నారు. తను కూడా 'జబర్దస్త్'కి గ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు హైపర్ ఆది. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని.. అన్నీ ఫుల్ లెంగ్త్ రోల్స్ అని.. ఇలాంటి సమయంలో 'జబర్దస్త్' కోసం వర్క్ చేయడం ప్రెజర్ గా ఉంటుందని కాబట్టి.. ఇవన్నీ క్లియర్ అయ్యాక 'జబర్దస్త్' చేస్తానని చెప్పారు హైపర్ ఆది.
Also Read: సూర్యతో దుల్కర్ సల్మాన్ - మరో క్రేజీ ప్రాజెక్ట్ తో 'కేజీఎఫ్' నిర్మాతలు!
Also Read: 'హ్యాపీ బర్త్ డే'తో మత్తు వదిలిపోయింది!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)