మార్పింగ్ వీడియోపై రష్మిక రియాక్షన్, ‘సలార్’ రూమర్స్‌కు చెక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఇలాంటి పరిస్థితి రావడం భయానకం - మార్ఫింగ్ వీడియోపై రష్మిక స్పందన ఇదే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందనాకి సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేసినట్లు ఉంది. వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది రియల్ వీడియో అనుకున్నారు. కానీ అది ఫేక్ వీడియో అని తేలడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని చూసి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియో అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. దీనిపై రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మణిరత్నం, కమల్ హాసన్ సినిమాలో స్టార్ యాక్టర్స్ - దుల్కర్‌తో పాటూ ఆ స్టార్ హీరోయిన్ కూడా!
కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #KH 234 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైన ఈ మూవీకి సంబంధించి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. నవంబర్ 7న కమలహాసన్ బర్త్ డే కావడంతో ఒక్కరోజు ముందుగానే సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించే ఇద్దరి నటీ నటుల వివరాలను మేకర్స్ పోస్టర్స్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇంతకీ ఆ నటీ నటులు ఎవరు? డీటెయిల్స్ లోకి వెళితే.. మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'నాయకుడు' మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కేరళలో 'సలార్'ని రిలీజ్ చేస్తున్న పృద్వీ రాజ్ ప్రొడక్షన్స్ - ఒక్క అప్డేట్‌తో రూమర్స్‌కి చెక్ పెట్టిన మేకర్స్!
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' (Salaar) గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన 'సలార్' మరోసారి వాయిదా పడబోతుందంటూ గత రెండు రోజులుగా మీడియా వర్గాల్లో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ సలార్ మరోసారి పోస్ట్ పోన్ అవ్వడం గ్యారెంటీ అంటూ అనుకుంటున్న తరుణంలో మూవీ టీం తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ తో రూమర్స్ కి చెక్ పెట్టింది. కాసేపటి క్రితమే సలార్ మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ అప్డేట్ ని అందించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సాంగ్ లీక్ - ఇద్దరు అరెస్ట్
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ నుంచి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ సాంగ్ లీకై ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. 'జరగండి' అంటూ సాగే ఈ పాట మూవీ టీం రిలీజ్ చేయకముందే ఆన్లైన్లో లీక్ అయింది. అయితే తాజాగా ఈ సాంగ్ ని లీక్ చేసిన ఓ ఇద్దరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' (Game Changer). కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మాసోడు ‘ఈగల్’ టీజర్‌తోనే విధ్వంసం సృష్టించేశాడు
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను టీజర్‌ను విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ దెబ్బతో రవితేజ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)