అన్వేషించండి

EAGLE Teaser : మాసోడు ‘ఈగల్’ టీజర్​తోనే విధ్వంసం సృష్టించేశాడు

రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్’. జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన టీజర్ దుమ్మురేపుతోంది.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను టీజర్‌ను విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ దెబ్బతో రవితేజ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది.    

ఆకట్టుకుంటున్న ‘ఈగల్’ టీజర్

ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియోను బట్టి ‘ఈగల్’ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు అర్థం అయ్యింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో రవితేజ గురించి ఒక్కొక్కరు చెప్పే విషయాలు ఆయను ఆకాశానికి ఎత్తేలా ఉన్నాయి. రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి గతంలో ఎప్పుడూ లేనంత మాస్ గా కనిపించారు. యాక్ష‌న్ తో పాటు థ్రిల్లింగ్‌గా కొనసాగింది టీజర్. “కొండ‌లో లావాను కింద‌కు పిల‌వ‌కు. ఊరు ఉండ‌దు. నీ ఉనికి ఉండ‌దు” అంటూ ర‌వితేజ చెప్పిన  సాలిడ్ డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. “అడ‌విలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. క‌నిపించ‌డు. కానీ వ్యాపించి ఉంటాడు” అంటూ ర‌వితేజ క్యారెక్ట‌ర్ గురించి శ్రీనివాస్ అవ‌స‌రాల ఇచ్చిన హైప్ టీజ‌ర్‌కు హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. “ఇది విధ్వంసం మాత్ర‌మే, త‌ర్వాత చూడ‌బోయేది విశ్వ‌రూపం” అంటూ న‌వ‌దీప్ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంటోంది.  టీజ‌ర్ చివ‌ర‌లో రవితేజ గెటప్ వారెవ్వా అనిపిస్తోంది. ముఖంపై గాటు, నోట్లు చుట్టతో మరింత మాసీగా కనిపించాడు.   

సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్

‘ఈగల్’ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందులో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా, కావ్య థాపర్. మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘ధ‌మాకా’తో ర‌వితేజ‌కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ, ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఈగల్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

రవితేజ రీసెంట్ గా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. ద‌స‌రా కానుకగా ఈ  మూవీ విడుదల అయ్యింది. డైరెక్టర్ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ రూపొందింది. అయితే, భారీ అంచనాలు నడుమ రిలీజైన ఈ మూవీ ఆశించిన మేర థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్, నుపుర్ సనన్, అనుపమ్ ఖేర్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.  

Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్

టాప్ హెడ్ లైన్స్

RC17 Update : రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Akka Web Series Review - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
Aadarsha Kutumbam Controversy : ఆదర్శ కుటుంబంలో 'జిమ్ జిమ్ తార' సాంగ్ - వెంకటేశ్ మూవీపై కాపీ రైట్స్ కాంట్రవర్సీ... 'పర్ణశాల' ప్రొడ్యూసర్ సీరియస్
ఆదర్శ కుటుంబంలో 'జిమ్ జిమ్ తార' సాంగ్ - వెంకటేశ్ మూవీపై కాపీ రైట్స్ కాంట్రవర్సీ... 'పర్ణశాల' ప్రొడ్యూసర్ సీరియస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget