కేరళలో 'సలార్'ని రిలీజ్ చేస్తున్న పృద్వీ రాజ్ ప్రొడక్షన్స్ - ఒక్క అప్డేట్‌తో రూమర్స్‌కి చెక్ పెట్టిన మేకర్స్!
గత రెండు రోజులుగా ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మరోసారి వాయిదా పడబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ ఓ అప్డేట్ ని అందించింది.
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' (Salaar) గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన 'సలార్' మరోసారి వాయిదా పడబోతుందంటూ గత రెండు రోజులుగా మీడియా వర్గాల్లో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ సలార్ మరోసారి పోస్ట్ పోన్ అవ్వడం గ్యారెంటీ అంటూ అనుకుంటున్న తరుణంలో మూవీ టీం తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ తో రూమర్స్ కి చెక్ పెట్టింది. కాసేపటి క్రితమే సలార్ మూవీ టీం సోషల్ మీడియా వేదికగా ఓ అప్డేట్ ని అందించింది. డీటెయిల్స్ లోకి వెళ్తే..
'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్'(Salaar) మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈపాటికి థియేటర్స్ లో సందడి చేయాల్సిన ఈ మూవీ పలు అనివార్య కారణాలవల్ల డిసెంబర్ 22 కి వాయిదా పడింది. మొదట సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ అవుట్ ఫుట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రశాంత్ నీల్ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశాడు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని మూవీ టీమ్స్ ప్లాన్ చేస్తున్న తరుణంలో మరోసారి 'సలార్' రిలీజ్ వాయిదా పడబోతుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
We are delighted to partner with @PrithvirajProd to present #SalaarCeaseFire in the vibrant state of 𝐊𝐞𝐫𝐚𝐥𝐚!
— Hombale Films (@hombalefilms) November 6, 2023
Get ready for an unforgettable cinematic experience.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial@shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/4dh1vfuZWK
అందుకు కారణం బాలీవుడ్ బాద్‌షా నటించిన 'డంకీ' చిత్రం అని తెలుస్తోంది. షారుక్ ఖాన్ 'డంకీ'తో 'సలార్' పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా 'డంకీ' వాయిదా పడబోతుందని న్యూస్ వచ్చింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు 'సలార్' గురించి కొన్ని రూమర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 22 నుంచి వచ్చే ఏడాది 'సలార్' మూవీని రిలీజ్ చేయబోతున్నారని ఓ ప్రచారం ఊపందుకుంది. సలార్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అందరూ నిజమే అనుకున్నారు.
కానీ తాజాగా మూవీ టీం ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఓ అదిరిపోయే అప్డేట్ అందించింది. అదేంటంటే, 'సలార్' మూవీ కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. 'సలార్'లో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పృధ్విరాజ్ ప్రొడక్షన్స్ 'సలార్' మూవీని కేరళలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇదే పోస్టర్ లో 'సలార్' వరల్డ్ వైడ్ డిసెంబర్ 22న విడుదల కాబోతుందని స్పష్టం చేయడంతో సినిమా మరోసారి వాయిదా పడబోతుందని వస్తున్న వార్తలకి చెక్ పడినట్లయింది.
‘కేజిఎఫ్' సినిమాని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వరి రావు, జగపతిబాబు, శ్రీయ రెడ్డి, టీనూ ఆనంద్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భువనగౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read : చిరంజీవి, నాగార్జున, రజినీకాంత్‌లతో సినిమా - కథలు కూడా రెడీగా ఉన్నాయన్న లారెన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial