News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు మూవీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అతి తక్కువ కాలంలోనే తెరమరుగు అయిపోయిన హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో నటి మాధవీ లత ఒకరు. ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాధవి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా కలసి రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడూ కాంట్రవర్సి కామెంట్లు కూడా చేసి వార్తల్లోకి ఎక్కింది ఈ బ్యూటీ. అయితే మాధవీ లత సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటంతో ఆమెను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు ఆమె పోస్ట్ లపై స్పందిస్తారు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి నెటిజన్లు ఎక్కువగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి పట్ల తన అభిప్రాయాన్ని చెప్తూ ఓ పోస్ట్ చేసింది మాధవి. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్

సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో  మీరా జాస్మిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ తన సత్తా చాటుతోంది. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యామిలీమెన్’ వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకున్న సమంత మరోసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘సిటాడెల్’ హిందీ వెర్షన్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అయితే తాజాగా ఈ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్?

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రేమ జంట గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 9 న ఈ జంటకు నిశ్చితార్థం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజనైర్ వీరి నిశ్చితార్థానికి దుస్తులను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటి వరకూ అటు వరుణ్ తేజ్ గానీ, ఇటు లావణ్య గానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది నిజమే అనే ప్రచారం జరుగుతోంది. వీరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ హారోలతో పాటు బంధువులు, సన్నిహితులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

‘వ్యూహం’తో రాజకీయ దుమారానికి సిద్ధమవుతోన్న ఆర్జీవీ - జగన్ దంపతులుగా నటిస్తోంది వీళ్ళే!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తన కొత్త సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ని ఖరారు చేశారు వర్మ. ఇక ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నానని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పై పడింది. "నేను అతి త్వరలో 'వ్యూహం' అనే ఓ రాజకీయ సినిమాను తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు. కానీ రియల్ పిక్ లో నూటికి నూరుపాలు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషయంతో నిండి ఉంటుంది" అంటూ తన కొత్త సినిమా గురించి పలు హింట్స్ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. అంతే కాదు ఈ సినిమాను తాను రెండు భాగాలుగా తీయబోతున్నానని మొదటి భాగానికి 'వ్యూహం' అని రెండో భాగానికి 'శపథం' అనే టైటిల్స్ ని పెట్టినట్లు పేర్కొన్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)

Published at : 01 Jun 2023 05:24 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

Krishna Mukunda Murari September 28th: మురారీతో తింగరిపిల్ల రొమాంటిక్ మూమెంట్ - కృష్ణతో ముకుంద సవాల్!

Krishna Mukunda Murari September 28th: మురారీతో తింగరిపిల్ల రొమాంటిక్ మూమెంట్ - కృష్ణతో ముకుంద సవాల్!

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Brahmamudi September 28th: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!

Brahmamudi September 28th: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!

Guppedanta Manasu September 28th: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

Guppedanta Manasu September 28th: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

టాప్ స్టోరీస్

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?