అన్వేషించండి

Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన

Mahakumbh 2025: మహా కుంభమేళా ఉత్సవాలకు రైలులో ప్రయాణించే అవకాశం ఉన్న లక్షలాది మంది భక్తుల కోసం ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ సజావుగా ప్రయాణాన్ని సాగించే ఉద్దేశంతో సన్నాహాలు పూర్తి చేస్తోంది.

Mahakumbh 2025 : జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో కొనసాగనున్న ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మహా కుంభమేళాకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 45 రోజుల్లో 45 కోట్ల మంది మహా కుంభమేళాలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తుల కోసం ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ 2025 ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉత్సవాల సమయంలోనే వచ్చే సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ వంటి పండుగలు రానున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ టైంలో విచ్చేసే భక్తుల రద్దీని నిర్వహించడానికి డివిజన్ అన్ని స్టేషన్‌లలో ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ప్రకటించింది. 

ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్ ప్రకటించిన రైల్వే డివిజన్ 

మహా కుంభమేళాలో భక్తులు ప్రధానంగా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అదో పవిత్రమైన చర్యగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ స్టేషన్‌ల ప్రవేశ, నిష్క్రమణ ప్రణాళికను ప్రకటించారు. "ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద, ప్లాట్‌ఫారమ్ నెం. 1 ద్వారా నగరం వైపు నుంచి మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అయితే ఎగ్జిట్ మాత్రం సివిల్ లైన్స్ వైపుకే పరిమితం చేస్తాం" అని ఎన్‌సీఆర్ జీఎం ఉమేష్ చంద్ర జోషి తెలిపారు. అన్‌రిజర్వ్ చేయని ప్రయాణీకులు వారి గమ్యస్థానం ప్రకారం దిశల వారీగా నిర్దేశించిన ప్యాసింజర్ షెల్టర్ ప్రాంతాల ద్వారా తగిన రైలు, ప్లాట్‌ఫారమ్‌కు మార్గనిర్దేశం చేస్తాం అని చెప్పారు. రిజర్వ్ చేసిన లేదా ప్రీ-రిజర్వ్ చేసిన ప్రయాణీకుల కోసం, ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లోని నగరం వైపున గేట్ నంబర్ 5 వద్ద ప్రత్యేక ఎంట్రీ పాయింట్ కేటాయిస్తారు. నైని జంక్షన్ వద్ద, స్టేషన్ రోడ్ నుండి మాత్రమే ప్రవేశం అనుమతిస్తారు. ఎగ్జిట్ గిడ్డంగి (అమల్గామ్) వైపు రెండవ ఎంట్రీకి పరిమితం చేస్తారు.

ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ నెం. 1 వద్ద చతం లైన్ ద్వారా ప్రవేశించవచ్చు. అయితే ప్లాట్‌ఫారమ్ నెం. 4 వద్ద రాంప్రియ రోడ్ ద్వారా ఎగ్జిట్ కావచ్చు. రిజర్వ్ చేసిన, అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణీకులకు సెకండరీ ఎంట్రీ గేట్ ద్వారా ప్రత్యేకంగా యాక్సెస్ మంజూరు చేస్తారు. ఫాఫమౌ స్టేషన్‌లో, ఎంట్రీ ప్లాట్‌ఫారమ్ నెం. 4 వద్ద ఉన్న రెండవ ఎంట్రీ గేట్ కు పరిమితం చేస్తారు. ఫాఫమౌ మార్కెట్ నుండి మాత్రమే ఎగ్జిట్ అందుబాటులో ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ స్టేషన్ కోసం, హనుమాన్ మందిర్ చౌరాహా వద్ద ప్రాథమిక ద్వారం నుండి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అయితే ఎగ్జిట్ మాత్రం లౌడర్ రోడ్‌కు పరిమితం చేస్తారు.

ఈ స్టేషన్స్ మూసివేత

ప్రయాగ్‌రాజ్ సంగం, దరగంజ్ స్టేషన్‌లు ప్రధాన స్నానపు ఉత్సవాల సమయంలో మూసివేయనున్నారు. ఎందుకంటే అవి జాతర ప్రాంతంలో ఉన్నాయి. మహాకుంభానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు, అన్ని ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లలో 3వేల నుంచి 4వేల మంది ప్రయాణికులకు వసతి కల్పించే విధంగా ప్యాసింజర్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్లు భక్తులకు వారి గమ్యస్థాన స్టేషన్ల ఆధారంగా మార్గనిర్దేశం చేయడానికి కలర్ - కోడెడ్ చేసి ఉంటాయి. అంతకుముందు డిసెంబర్‌లో, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 3వేల ప్రత్యేక ఫెయిర్ రైళ్లతో సహా సుమారు 13వేల రైళ్లను నడపాలని ప్లాన్ చేశారు. మహాకుంభానికి 450 మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 100 మిలియన్ల మంది రైలులో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అవకాశం ఉంది.

Also Read : Special Trains: కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget