Special Trains: కుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
SCR: యూపీలో కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ద.మ రైల్వే 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మరోవైపు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ స్టేషన్ల మధ్య 4 ప్రత్యేక రైళ్లను పొడిగించింది.
SCR Special Trains To Kumbhmela From AP And Telangana: ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాకు (Kumbhmela) తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు స్టేషన్ల నుంచి 8 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. మంగళూరు సెంట్రల్ - వారణాసి - మంగళూరు సెంట్రల్, చెన్నై సెంట్రల్ - గోమతినగర్ - చెన్నై సెంట్రల్ సర్వీసులను ఏర్పాటు చేసింది.
పూర్తి వివరాలివే..
- మంగళూరు సెంట్రల్ - వారణాసి - మంగళూరు సెంట్రల్ (రైలు నెం. 06019/06020) ప్రత్యేక రైళ్లు కాసర్‌గోడ్, నీలేశ్వర్, పయ్యనూర్, కన్నూర్, తలస్సేరి వడకరా, కోజికోడ్, ఫెరోక్, తిరూర్, షోరనూర్, ఒట్టపాలెం, పాలక్కాడ్, కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, ఇటార్సీ పిపారియా, జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.
- చెన్నై - గోమతినగర్ - చెన్నై (రైలు నెం. 06071/06072) ప్రత్యేక రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, కొత్త గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయోగ్‌రాజ్ ఛెజాక్, చునార్, వారణాసి, అయోధ్య ధామ్ స్టేషన్లలో ఇరువైపులా సాగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు
మరోవైపు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది.
Extension of Special Train Services @RailMinIndia pic.twitter.com/IvcdALCn6u
— South Central Railway (@SCRailwayIndia) December 31, 2024
- జనవరి 7వ తేదీ నుంచి మార్చి 25 వరకూ షోలాపూర్ - ముంబయి (రైలు నెం. 01435) వరకు ప్రతి మంగళవారం రైలును ద.మ రైల్వే పొడిగించింది.
- జనవరి 1 నుంచి మార్చి 26 వరకూ ఎల్‌టీటీ ముంబయి - షోలాపూర్ (రైలు నెం. 01436) వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉండనుంది.
- జనవరి 2 నుంచి మార్చి 27 వరకూ ప్రతి గురువారం షోలాపూర్ - తిరుపతి (రైలు నెం. 01437), జనవరి 3 నుంచి మార్చి 28 వరకు తిరుపతి - షోలాపూర్ (రైలు నెం. 01438) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనుంది.
ఆ రైళ్లు పునరుద్ధరణ
అటు, ప్రజల డిమాండ్ దృష్ట్యా 8 మొము రైళ్ల సేవలను పునరుద్ధరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. అలాగే, 14 రైళ్లకు అదనపు కోచ్‌లను పెంచింది.
- విశాఖ - పలాస - విశాఖ (రైలు నెం. 07470/07471) సర్వీసును మార్చి 1 వరకూ శుక్ర, ఆదివారాలు మినహా పునరుద్ధరించారు.
- విశాఖ - పలాస -విశాఖ (67289/67290) రైలు సర్వీసును జనవరి 1వ తేదీ నుంచి మార్చి 1 వరకూ పునరుద్ధరించారు.
- విశాఖ - విజయనగరం (రైలు. నెం. 07468) రైలు సర్వీస్ ఫిబ్రవరి 28వ తేదీ వరకూ పునరుద్ధరించారు.
- విశాఖ - విజయనగరం - విశాఖ (67287/67288) రైలు సర్వీసు జనవరి 1 నుంచి మార్చి 1 వరకూ అందుబాటులో ఉంటుంది.