News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Varun Tej: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్?

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉన్నారనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంటకు నిశ్చితార్థం జరగనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Varun Tej: టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రేమ జంట గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 9 న ఈ జంటకు నిశ్చితార్థం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజనైర్ వీరి నిశ్చితార్థానికి దుస్తులను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటి వరకూ అటు వరుణ్ తేజ్ గానీ, ఇటు లావణ్య గానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది నిజమే అనే ప్రచారం జరుగుతోంది. వీరి ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీ హారోలతో పాటు బంధువులు, సన్నిహితులు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. 

‘మిస్టర్’ సినిమా నుంచే..

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ వరుణ్, లావణ్యలు మాత్రం లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుంది. అప్పుడే వీరి డేటింగ్ వ్యవహారం పై వార్తలు వచ్చాయి. అయితే దానిపై మెగా ఫ్యామిలీలో ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో లావణ్య బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి వరుణ్ హాజరై ఓ కాస్ట్లీ డైమండ్ రింగ్ తో లావణ్యకు ప్రపోజ్ చేశాడని, ఆమె కూడా ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని నెలలకే నాగబాబు  ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 

వరుణ్ తో పెళ్లెప్పుడంటూ కామెంట్స్..

ఇటీవల లావణ్య హాలిడే టూర్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో ఓ సెల్ఫీ దిగి అప్లోడ్ చేసింది. దానికిి ‘ట్రావెల్ మోడ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కానీ ఆమె ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అదే సమయంలో వరుణ్ కూడా హాలిడేలో ఉన్నాడని తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కలసి పారిస్ టూర్ కు వెళ్లారనే టాక్ కూడా ఉంది. దీంతో కొంతమంది అభిమానులు లావణ్య పోస్ట్ కింద రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘వెల్కం టూ మెగా ఫ్యామిలీ’, ‘ఆల్ ది బెస్ట్’, ‘వరుణ్ తో మీ పెళ్లి ఎప్పుడు’ అంటూ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ హైదరాబాద్ తిరిగి రానున్నారని, వచ్చిన తర్వాత వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. 

Read Also : అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్

Published at : 01 Jun 2023 04:19 PM (IST) Tags: Lavanya Tripathi Varun tej Mega family Varun Tej Marriage

ఇవి కూడా చూడండి

Month of Madhu: కథ వినకుండానే ఈ సినిమా చేశాను, కనీసం డైలాగ్స్ కూడా ముందు చెప్పలేదు: నవీన్ చంద్ర!

Month of Madhu: కథ వినకుండానే ఈ సినిమా చేశాను, కనీసం డైలాగ్స్ కూడా ముందు చెప్పలేదు: నవీన్ చంద్ర!

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్

రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!

'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌

Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్‌