అన్వేషించండి

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది నటి మాధవీ లత. ఇటీవల ఆమె పెళ్లిపై వస్తోన్న వార్తలపై స్పందించింది. ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అతి తక్కువ కాలంలోనే తెరమరుగు అయిపోయిన హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో నటి మాధవీ లత ఒకరు. ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాధవి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా కలసి రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడూ కాంట్రవర్సి కామెంట్లు కూడా చేసి వార్తల్లోకి ఎక్కింది ఈ బ్యూటీ. అయితే మాధవీ లత సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటంతో ఆమెను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు ఆమె పోస్ట్ లపై స్పందిస్తారు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి నెటిజన్లు ఎక్కువగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి పట్ల తన అభిప్రాయాన్ని చెప్తూ ఓ పోస్ట్ చేసింది మాధవి. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

శారీరకంగా, మానసికంగా నేను సిద్ధంగా లేను: మాధవీ లత

నటి మాధవీ లతకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్స్ ఆమెను పెళ్లెప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన పెళ్లిపై వస్తోన్న కామెంట్లకు కౌంటర్ ఇవ్వాలనుకుందో ఏమో పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అందులో పెళ్లి పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది. పెళ్లి అనేది వయసుకు సంబంధించింది కాదని, ఆమె శారీరకంగా, మానసికంగా పెళ్లి సిద్దంగా ఉన్నప్పుడే పెళ్లి చేయాలని అదే పెళ్లికి సరైన సమయమని అంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని, అది ఆమె నిర్ణయానికి సంబంధించింనదని చెప్పుకొచ్చింది. అయితే తాను కూడా ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా పెళ్లికి సిద్దంగా లేనని, భవిష్యత్ లో కూడా దానిపై క్లారిటీ లేదని పేర్కొంది. ఇది నా జీవితం, నా ఇష్టం అంటూ రాసుకొచ్చింది మాధవి. 

అవకాశాలు రాక రాజకీయాల్లో రానించలేక..

నటి మాధవీ లత చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. తర్వాత 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ తర్వాత పలు సనిమాల్లో నటించింది మాధవీ. అయితే సినిమా రంగంలో ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరింది. ఆ పార్టీకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ వచ్చింది. అలా కొన్ని కాంట్రవర్సీ  కామెంట్స్ చేసి వార్తల్లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదొక వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది మాధవి. రాజకీయంగానే కాకుండా సినిమా ఇండస్ట్రీ పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది మాధవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న ఆమె పెళ్లి పై వస్తోన్న వార్తలపై తనదైన శైలిలో స్పందించి మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

Read Also : అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MadhaviLatha ll sanathani ll BJP Women ll Orator ll (@actressmaadhavi)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget