Vimanam Movie Trailer: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్
సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విమానం’. త్వరలో ఈ మూవీ విడుదలకానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల అయ్యింది. కొడుకును విమానం ఎక్కించేందుకు ఓ తండ్రి పడే కష్టం కంటతడి పెట్టిస్తోంది.
సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విమానం'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
కంటతడి పెట్టిస్తున్న ‘విమానం’ ట్రైలర్
ఇప్పటికే ‘విమానం’ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనసూయకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా పోస్టర్లను రిలీజ్ చేసింది. ఎర్ర రంగు జాకెట్, పూల పూల చీరలో చక్కటి చిరునవ్వుతో అనసూయ ఆకట్టుకుంది. అరుగు మీద కూర్చుని స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విమానం ఎక్కాలనే తన కొడుకు కోరికను తీర్చేందుకు కన్నతండ్రి పడే ఆవేదనను ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. కన్నకొడుకును ఎలాగైనా విమానంలో తీసుకెళ్లేందుకు రూ. 10 వేల కోసం తండ్రి ఉన్న సైకిల్ కూడా అమ్మే సీన్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అటు అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేషాలు కూడా అందరినీ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.
A gut wrenching story of a father & son ✈️#VIMANAM TRAILER out now 🤗https://t.co/4dChP2VVQf
— Zee Studios South (@zeestudiossouth) June 1, 2023
Landing at your nearest cinemas on June 9th 🛫@thondankani @anusuyakhasba #Meerajasmine @DhanrajOffl @eyrahul @SivaPYanala @CharanArjunwave @KkCreativeWorks @lemonsprasad @dir_kiran… pic.twitter.com/AS55nN1NUu
జూన్ 9న 'విమానం' సినిమా విడుదల
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. ‘విమానం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సముద్రఖని ఫస్ట్ లుక్, ప్రోమో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని అర్థం అవుతోంది. అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా కన్న కుమారుడిని జాగ్రత్తగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రలో సముద్రఖని నటించారు. ప్రోమోలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించారు.
''జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ఈ 'విమానం'. తండ్రి కుమారుల అనుబంధంతో పాటు ఎన్నో మంచి అంశాలు మా సినిమాలో ఉన్నాయి'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందట. ట్రైలర్ కు లభిస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది.
Read Also: ‘ప్రాజెక్ట్ K’ మూవీలో విలన్‌గా కమల్ హాసన్? భారీ రెమ్యునరేషన్ ఆఫర్?