అన్వేషించండి

Project K: ‘ప్రాజెక్ట్ K’ మూవీలో విలన్‌గా కమల్ హాసన్? భారీ రెమ్యునరేషన్ ఆఫర్?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్  అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో విలన్ రోల్ కోసం కమల్ తో సంప్రదింపులు

తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ అందుతోంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ తో ఈ చిత్ర నిర్మాతలు మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఆయనను విలన్ పాత్ర పోషించాలని కోరుతున్నారట. అయితే, ఈ చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని మేకర్స్ అడుగుతున్నారు. ఇందుకోసం అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఆఫర్ కు కమల్ అంగీకరిస్తే ‘ప్రాజెక్ట్ K’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రేడ్ సర్కిల్‌లలో హాట్  కేక్ అయ్యే అవకాశం ఉంది.  

విష్ణువు మోడరన్ అవతార్- అశ్వినీ దత్

‘ప్రాజెక్ట్ K’ సినిమా జానర్ గురించి నిర్మాత అశ్వీని దత్ ఇప్పటికే పలు విషయాలు వెల్లడించారు. “ఈ చిత్రంలో ఫాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విష్ణువు యొక్క మోడరన్ అవతారం గురించి ఉంటుంది. కానీ అదే సమయంలో, సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లను పర్యవేక్షించడానికి నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ లను తీసుకొచ్చాం. సినిమాలో మీరు చూసే ప్రతి ఒక్కటీ ఆశ్చర్యపరుస్తుంది” అని చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది జనవరి 12న ‘ప్రాజెక్ట్ K’ విడుదల

‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ తో రూపొందించబడిన చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ చిత్రానికి డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  ‘ప్రాజెక్ట్ K’ కంటే ముందు, ప్రభాస్  ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘ఆది పురుష్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అటు ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ మూవీ చేస్తున్నాడు.  మారుతీ డైరెక్షన్ లోనూ ‘రాజా డీలక్స్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.   

Read Also: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్

టాప్ హెడ్ లైన్స్

Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Embed widget