రాజమౌళి ‘మహాభారతం’ తీస్తారా? తన నటన తనకే నచ్చదంటున్న చైతూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
రాజమౌళి 'మహాభారతం', చదవడానికి ఏడాది - పది భాగాలుగా!
'బాహుబలి'తో రాజమౌళి రేంజ్ మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఆయన వెళ్ళారు. ఇండియాలో, ఆ మాటకు వస్తే విదేశాల్లో 'బాహుబలి' ఏ స్థాయి విజయం సాధించిందనేది అందరికీ తెలుసు. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు తీసిన సినిమా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'. దాంతో ఏకంగా ఆస్కార్ అవార్డును తెలుగుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేయబోయే, చేయాలని అనుకునే సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంటుంది. అందుకని, మరోసారి మహాభారతం ప్రస్తావన రాజమౌళి ముందుకు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'కస్టడీ'లో ఆ బూతుకు కత్తెర - సెన్సార్ రిపోర్ట్, రివ్యూ ఎలా ఉందంటే?
అక్కినేని హీరోలకు ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూసేలా వాళ్ళ సినిమాలు ఉంటాయి. నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) తాజా సినిమా 'కస్టడీ'కి కూడా అందరూ వెళ్లవచ్చని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా (NBK 108 Movie) తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) నటిస్తున్నారు. ఈ రోజు చిత్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్ కాపీనా? ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గూఢచారిగా కనిపించనున్నారు. 'మళ్ళీ రావా', 'జెర్సీ' చిత్రాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రౌడీ బాయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోది స్పై రోల్. హీరో బర్త్ డే సందర్భంగా నిన్న ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయడానికి కారణమైంది. దీంతో ఆ మూవీ నిర్మాత స్పందించక తప్పలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నా యాక్టింగ్ నాకే నచ్చదు, ఏ సినిమా చూసినా ఇలా చేశానేంటి అనిపిస్తుంది: అక్కినేని నాగ చైతన్య
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి బైలింగ్వల్ మూవీ ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ తమిళ యూట్యూబర్ కు హీరో నాగ చైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన నటన గురించి, తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)