By: ABP Desam | Updated at : 10 May 2023 09:28 AM (IST)
అక్కినేని నాగ చైతన్య (Photo Credit: Chay Akkineni Instagram)
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి బైలింగ్వల్ మూవీ ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ తమిళ యూట్యూబర్ కు హీరో నాగ చైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన నటన గురించి, తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఇంటర్వ్యూలో భాగంగా మీ నటనకు 10 మార్కులకు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అని అడిగిన ప్రశ్నకు చైతన్య ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పారు. “నా నటనకు నేను వేసుకునే మార్కులు 5 కంటే తక్కువే. నా పాత సినిమాలు చూసినప్పుడు ఇలా చేశాను ఏంటి? అనిపిస్తుంది. నేను చేసిన ఏ సినిమా చూసినా యాక్టింగ్ పరంగా బాగా ఇంప్రూవ్ కావాలి అనిపిస్తుంది. ఇంత వరకూ నేను నా నటన పట్ల సంతృప్తిగా లేను. సెల్ఫ్ క్రిటిసిజమ్ అనేది మానసిక ఎదుగుదలకు చాలా మంచిదని నేను భావిస్తాను. నా సినిమాల్లో నా యాక్టింగ్ ను చూసి పెద్దగా ఎంజాయ్ చేయలేను” అని చైతన్య వివరించాడు. చైతూ ఇంత నిజాయతీ మాట్లాడటం చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మిగతా హీరోలైతే ఇలా చెప్పుకోగలరా? అని అంటున్నారు.
— T (@MovieNCriclover) May 8, 2023
ఇక ‘కస్టడీ’ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నాగ చైతన్య తెలిపారు. సినీ అభిమానులను ఈ మూవీ అస్సలు డిజప్పాయింట్ చేయదని చెప్పారు. “ఈ సినిమాతోనే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో చిత్రీకరించాం. డబ్ చేయలేదు. నేను ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాను. సాధారణంగా హీరో విలన్‌ని చంపాలని చూస్తుంటాం. అయితే, ఈ సినిమాలో హీరో ఏదోవిధంగా విలన్‌ని బతికించుకోవాలి అని చూస్తాడు. అందుకే ఈ సినిమాకు ‘కస్టడీ’ అని పేరు పెట్టారు. ఇది పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందింది. రైలులోని యాక్షన్ సీక్వెన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. అరవింద్ స్వామితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సీనియర్ నటులు శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. కృతి శెట్టి, నేను ‘బంగార్రాజు’ సినిమాలో కలిసి పనిచేశాం. ఈ సినిమా తమిళ్, తెలుగులో మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను” అని వెల్లడించారు.
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో ‘కస్టడీ’ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.
Read Also: ఆ సినిమా చూస్తే రూ.82 వేలు ఇస్తారట - కానీ, ఓ కండీషన్ ఉంది!
Ennenno Janmalabandham June 8th: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!