News
News
వీడియోలు ఆటలు
X

Fast and Furious: ఆ సినిమా చూస్తే రూ.82 వేలు ఇస్తారట - కానీ, ఓ కండీషన్ ఉంది!

మూవీ చూడాలంటే డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు. కానీ, ఓ సినిమా చూస్తే వాళ్లే డబ్బులిస్తారట. టికెట్స్, స్నాక్స్ డబ్బులతో పాటు వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే ఏకంగా 1,000 డాలర్లు గిఫ్టుగా ఇస్తారట!

FOLLOW US: 
Share:

ఓటీటీల విస్తృతి పెరిగిన తర్వాత జనాలు సినిమా థియేటర్లకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఓటీటీలో అయితే, ఎంచక్కా తీరిక ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో చూసుకోవచ్చనే భావన చాలా మందిలో కలుగుతోంది. కాసేపు, ఈ ఖర్చుగోల పక్కన పెడితే, త్వరలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ 10వ భాగం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా బృందం ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే భారీగా నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అభిమానులకు బంఫర్ ఆఫర్

హాలీవుడ్ మూవీ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ సినిమాలను ఇప్పటికీ చాలా మంది అభిమానులు కన్నురెప్ప వాల్చకుండా చూస్తారు. విన్ డీజిల్  ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటి వరకు 9 పార్టులుగా విడుదల అయ్యింది. అన్ని సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఈ సిరీస్ లో 10వ సినిమాగా ‘ఫాస్ట్ X’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫినాన్స్ బజ్ అనే ఓ వెబ్సైట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.  ఈ మూవీ చూసిన వాళ్లకి  ఏకంగా 1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 82,000) రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.   

ప్రైజ్ మనీ గెలవాలంటే ఏం చేయాలంటే?

సదరు వెబ్ సైట్ ఇచ్చిన బంఫర్ ఆఫర్ ను పొందేందుకు ఓ కండీషన్ పెట్టింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయ్యిందో పరిశీలించాలి. ఆ డీటైల్స్ అన్నీ ఓ నోట్ గా రాసి సదరు వెబ్ సైట్ కు అందజేయాలి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్స్యూరెన్స్ భారం పడుతుందనేది ఆ వెబ్ సైట్ వాళ్లే అంచనా వేస్తారు. వారి అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో, వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.   

మే 26న విజేతల ప్రకటన

ఈ అవకాశం కేవలం అమెరికాలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని ఫినాన్స్ బజ్ వెబ్ సైట్ వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన సినీ అభిమానులు ఇందుకోసం ముందుగా ఫినాన్స్ బజ్ వెబ్సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా విడుదల తేదీ అంటే మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విజేతలను  మే 26 లోగా ప్రకటించనున్నట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా  అత్యధిక మంది ఇష్టపడే సినిమాల్లో 'జేమ్స్‌ బాండ్‌' సిరీస్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆ తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన సిరీస్  'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'.  ఇందులో రేసింగ్‌, యాక్షన్‌ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు 9 సినిమాలు రాగా,  10వ భాగం  మే 19న విడుదలకానుంది. ఈ సిరీస్ మూవీస్ లో విన్ డీజిల్‌, టైరీస్‌ గిబ్సన్‌, సంగ్‌ కాంగ్, క్రిస్‌ బ్రిడ్జెస్‌, జోర్డానా బ్రూస్టర్‌, మైఖెల్‌ రోడ్రిగ్జ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.  

Read Also: హైదరాబాద్‌లో విల్లా కొన్న సమంత - ఖరీదెంతో తెలుసా?

Published at : 10 May 2023 08:56 AM (IST) Tags: Fast And Furious FinanceBuzz Vin Diesel Fast X Movie 1000 dollars gift Paul Walke

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !