News
News
వీడియోలు ఆటలు
X

హైదరాబాద్‌లో విల్లా కొన్న సమంత - ఖరీదెంతో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. ఇప్పుడు ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఓ ఫ్లాట్ ను కొన్నారని, దాని విలువ రూ.7.8కోట్లని ప్రచారం సాగుతోంది.

FOLLOW US: 
Share:

Samantha Ruth Prabhu: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీ కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కావడం లేదు. చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇతర వ్యాపారాలలోకి మారుతున్నారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. అదే తరహాలో సమంత రూత్ ప్రభు కూడా ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని విలువ ఏకంగా రూ.7.8 కోట్లు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జయభేరి ఆరెంజ్ కౌంటీలోని నల్ల ప్రీతమ్ రెడ్డిలో సమంత ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది మొత్తం 6 కార్ పార్కింగ్ స్లాట్స్‌తో ఉన్నట్టు సమాచారం. సూపర్ బిల్ట్ అప్ ఏరియాలో ఈ అపార్ట్‌మెంట్ మొత్తం 7944 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ఫర్మ్ CRE Matrix వెల్లడించింది. ఇందులో 13వ అంతస్తులో 3920 చదరపు అడుగుల ఫ్లాట్, 14వ అంతస్తులో 4024 చదరపు అడుగుల ఫ్లాట్ ఉన్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉండగా సమంత ఇంతకుముందు ముంబైలో రూ.15 కోట్ల విలువైన ఓ రాజభవనం లాంటి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సముద్ర తీరంలో  ఉన్న ఈ విలాసవంతమైన 3 bhkను సమంత కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు సమంత ప్రస్తుతం నివసిస్తున్న జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన ఇల్లు కూడా కలిగి ఉంది. దీని విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన చూస్తుంటే.. తెలుగు నటి రష్మిక మందన్న తర్వాత.. దేశ ఆర్థిక రాజధానిలో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేయడంలో సమంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక సమంత సినిమా విషయానికొస్తే.. ఆమె రాబోయే టాలీవుడ్ చిత్రం 'ఖుషి'తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని యోచిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సమంత బాలీవుడ్‌లో అమెజాన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'లో హీరో వరుణ్ దావన్‌తో కలిసి నటిస్తోంది.

మే 9న రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో.. సమంత సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేసింది. విజయ్ బర్త్ డే విషెస్ తెలిపిన సామ్..  తనకు మంచి ఫ్రెండ్, తన ఫేవరేట్ యాక్టర్ అని రాసుకొచ్చింది. విజయ్ సక్సెస్ కోసం తాను ప్రార్థిస్తానని.. విజయ్ లైఫ్ లో ప్రతి దాంట్లోను బెస్ట్ దొరకాలని ఆమె చెప్పుకొచ్చింది. విజయ్.. దానికి అర్హుడు అంటూ ఆమె పోస్టులో తెలిపింది. ఈ పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. గత సంవత్సరం సమంత పుట్టిన రోజున 'ఖుషి' సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ వెరైటీ సర్‌ప్రైజ్ ఇచ్చి ఆమెను సంతోషపెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరూ 'ఖుషి' షూటింగ్ లోనే ఉన్నారు. మరి ఈ సారి సమంత విజయ్ బర్త్‌డే కి ఏం సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుందోనని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Also Read 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?

Published at : 09 May 2023 07:36 PM (IST) Tags: Hyderabad Samantha Ruth Prabhu plot Samantha New Home TOLLYWOOD

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు