అన్వేషించండి

‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ డేట్, ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'కల్కి 2898 ఏడీ' ముందు వరుసలో ఉంటుంది. 'సలార్' వంటి సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడం, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీ పెంచాయి. ఆల్రెడీ గ్లింప్స్ వీడియోతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని హింట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక తాజాగా 'కల్కి2898 ఏడీ' ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఒక రూమర్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పాతికేళ్ల తర్వాత హిందీ సినిమా - ఇప్పుడు తనకు ఏం కావాలో చెప్పిన జ్యోతిక
మార్చి 8న విడుదలకు సిద్ధమైన హిందీ చిత్రాల్లో 'సైతాన్' ఒకటి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, సౌత్ స్టార్ ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో జ్యోతిక మరో ప్రధాన పాత్రధారి. 'సైతాన్' స్పెషాలిటీ ఏమిటంటే... పాతికేళ్ల తర్వాత జ్యోతిక నటించిన హిందీ చిత్రమిది. ఇరవై సంవత్సరాల మాధవన్, జ్యోతిక నటించిన చిత్రమిది. ఆత్మలు, క్షుద్రపూజలు నేపథ్యంలో సినిమా తీశారు. 'సైతాన్' విడుదల సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కథల ఎంపికలో తాను ఏ విషయానికి ప్రాముఖ్యం ఇస్తాననేది జ్యోతిక చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ఫ్యామిలీ స్టార్’ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
జనవరి, ఫిబ్రవరీలో సినిమాల సందడి ముగిసింది. వచ్చే రెండు నెలల్లో పెద్దగా ప్రేక్షకులు ఎగ్జైట్ చేసే సినిమాలు ఏవీ వారి ముందు రావడం లేదు. దీంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 5న విజయ్ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను నెల ముందే ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ‘టీజర్ వస్తుంది’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన రెండు రోజుల్లోనే ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ అప్డేట్‌తో ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఖాన్‌లతో కాలు కదిపిన మెగా పవర్ స్టార్ - 'నాటు నాటు' పాటకి స్టెప్పులు!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ముఖేష్, నీతూ అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక అనంత్ ని వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు పంచ వ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, దేశ విదేశాలకు చెందిన ప్రధానులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేటితో ముగియనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్సులతో తెగ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సినిమా కేక పుట్టిస్తుంది, అందులో డౌట్ లేదు - ‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్
కమర్షియల్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవి కొందరు హీరోలకు సక్సెస్ ఫార్ములాగా మిగిలిపోతాయి. అలాంటి వారిలో గోపీచంద్ ఒకరు. మ్యాచో స్టార్ గోపీచంద్.. చివరిగా ‘రామబాణం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేదు. అందుకే ప్రస్తుతం తన ఆశలన్నీ అప్‌కమింగ్ మూవీ ‘భీమా’పైనే ఉన్నాయి. ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేయడానికి మేకర్స్.. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. హన్మకొండలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget