Ram Charan: ఖాన్‌లతో కాలు కదిపిన మెగా పవర్ స్టార్ - 'నాటు నాటు' పాటకి స్టెప్పులు!
Naatu Naatu : అంబానీ ఇంత జరిగిన సంగీత్ పార్టీలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ 'నాటు నాటు' సాంగ్ కి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
The Khan trio’s moves to the ‘Naatu Naatu’ : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ముఖేష్, నీతూ అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక అనంత్ ని వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు పంచ వ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, దేశ విదేశాలకు చెందిన ప్రధానులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేటితో ముగియనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్సులతో తెగ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
'నాటు నాటు' పాటకి స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్స్
అంబానీ సంగీత్ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ తమ డాన్స్ లతో సందడి చేశారు. 'RRR' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ కి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ తమ స్టెప్పులతో కనువిందు చేశారు. 'నాటు నాటు' పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సిగ్నేచర్ స్టెప్స్ ని ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ ట్రై చేయగా.. అది సరిగ్గా రాకపోవడంతో సల్మాన్ ఖాన్ ఆ స్టెప్ మార్చి తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ నవ్వులు పూయించారు. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు ఒకే స్టేజిపై కలవడం ఒకెత్తు అయితే.. 'నాటు నాటు' పాటకి డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ఆ వీడియోని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. అనంతరం రామ్ చరణ్ కూడా వారితో జతకలిశాడు.
Naacho naacho naacho naacho ⁰Naacho naacho yaara naacho… 🤩 pic.twitter.com/lK1TKv4y5K
— RRR Movie (@RRRMovie) March 3, 2024
Whaatt a high moment ❤️🤩@AlwaysRamCharan @iamsrk@BeingSalmanKhan#AmirKhan pic.twitter.com/TYrTTCtp6j
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2024
పాప్ సింగర్ రిహాన్నా పెర్ఫార్మన్స్ కి అన్ని కోట్లా?
అనంత్ అంబానీ, రాధిక ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన సంగీత్ లో అమెరికా పాప్ సింగర్ రిహాన్నా తన పర్ఫామెన్స్ తో ఉర్రూతలూగించింది. రిహాన్నా ఇండియాకి రావడం ఇదే మొదటిసారి. కాగా అంబానీ ఇంట జరిగిన సంగీత్ పార్టీలో తన ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన రిహాన్నా కి అంబానీ ఫ్యామిలీ ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే సుమారు రూ.66 కోట్ల నుంచి రూ.74కోట్ల వరకు ఉంటుంది.
అతిథుల కోసం 2500 రకాల వంటకాలు
గుజరాత్ లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ దాదాపు 2500 రకాల వంటకాలను వడ్డించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హాజరయ్యే అతిరథ మహారధుల కోసం ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్ బృందాన్ని జామ్ నగరానికి రప్పించారట.
పార్సీ నుంచి థాయ్ వరకు మెక్సిజన్ నుంచి జపనీస్ వరకు అన్ని రకాల వెరైటీలను సిద్ధం చేశారు. అంతేకాదు వచ్చే అతిధులకు ఏదైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే వెంటనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : ‘ఫ్యామిలీ స్టార్’ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్