అన్వేషించండి

Kalki2898AD Trailer : ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - 'కల్కి2898AD' ట్రైలర్ ఎప్పుడంటే?

Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ ని ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Kalki 2898 AD trailer release : టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'కల్కి 2898 ఏడీ' ముందు వరుసలో ఉంటుంది. 'సలార్' వంటి సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడం, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీ పెంచాయి. ఆల్రెడీ గ్లింప్స్ వీడియోతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని హింట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక తాజాగా 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ రిలీజ్ గురించి ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది.

 ఏప్రిల్ 9న 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్?

'కల్కి' సినిమా మహాభారతంలో స్టార్ట్ అయ్యి 2898వ సంవత్సరంలో ముగుస్తుందని, ఈ కథ 6000 సంవత్సరాల మధ్య జరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఈవెంట్ లో చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ రూమర్లతోనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే 9వ తేదీన సినిమా విడుదల కాగా, ఈ రూమర్స్ నిజమైతే నెల ముందు ట్రైలర్ విడుదల కానుంది.

 ఆ హాలీవుడ్ సినిమాతో పోలికలు

డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని తీసుకొని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో 'కల్కి' సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే 'బ్లేడ్ రన్నర్' అనే హాలీవుడ్ సినిమాతో 'కల్కి' సినిమాకి పోలికలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వినిపించగా.. ఆ వార్తలపై ఇటీవల ఈవెంట్ లో డైరెక్టర్నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు." కల్కి 2898 ఏడీ కోసం అప్పటి రోజులకు తగినట్టు ఒక ప్రపంచాన్ని సృష్టించాం. అన్నింటిలో ఇండియన్ టేస్ట్ కనిపించేలా జాగ్రత్త తీసుకున్నాం. దాదాపు ఇదే కథాంశంతో గతంలో బ్లేడ్ రన్నర్ అనే చిత్రం విడుదలయ్యింది. కానీ దాని పోలికలు ఏమీ ఈ చిత్రంలో కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. ఇది మాకు పెద్ద సవాలులాగా అనిపించింది" అని అన్నారు.

22 భాషల్లో విడుదల

'కల్కి2898 ఏడీ' సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియా అంతటా ఈ వార్త ట్రెండ్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ గా 'కల్కి2898 ఏడీ' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

Also Read : సినిమా కేక పుట్టిస్తుంది, అందులో డౌట్ లేదు - ‘భీమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్

టాప్ హెడ్ లైన్స్

Golden Bhagyam Title Glimpse: 'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
'గోల్డెన్ భాగ్యం' తెలుగు టైటిల్ గ్లింప్స్‌... 'KH X RK Reunion' స్పూఫ్, పవన్ & మహేష్‌ను వాడేశారుగా
Puri Jagannadh: పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
పూరి ఛార్మీని ఏకిపారేసిన లేడీ ప్రొడ్యూసర్... పరువు పోయేలా ఉంది - రియాక్ట్ అవుతారా?
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... చిరు టాక్ షోకి 200 కోట్ల డీల్?
Meenakshi Chaudhary: నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?
నానితో మీనాక్షి చౌదరి రొమాన్స్... 'ప్యారడైజ్' తర్వాత సినిమాలో?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget