మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అవును, లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఇంట్లో అతి త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తెలుగు తెర 'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారనేది కొత్త వార్త ఏమీ కాదు. చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే... ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ చెప్పింది లేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తమన్నాకు రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గారితో నటించాలనేది తన కల అని, అది నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కథానాయకుడిగా 'కొలమావు కోకిల', శివ కార్తికేయన్ 'డాక్టర్', విజయ్ 'బీస్ట్' చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). ఆ సినిమాలో తమన్నా కథానాయికగా నటించారు. ఈ మధ్య చిత్రీకరణ పూర్తి అయ్యింది. రజనీతో నటించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు... చిత్రీకరణలో తనకు ఓ బహుమతి కూడా ఇచ్చారని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ
'భగవంత్ కేసరి'... మీరు చదివింది నిజమే! 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie)గా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన పేరు మీరు చదివినదే. సినిమా టైటిల్ కూడా అదే! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
స్నేహితులతో కలిసి చికెన్ తినడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు! అంతలో ఆయన ముందుకు ఓ మేనేజర్ వచ్చారు! 'సార్... సార్... ఇది క్లోజింగ్ టైమ్' అంటూ చేతికి ఉన్న గడియారంలో టైమ్ చూపించాడు. వెంటనే ఎన్టీఆర్ అగ్గిపెట్టె తీసుకుని ఓ స్టిక్ బయటకు తీశారు. అగ్గిపుల్ల వెలిగించారు. చంద్రుడికి అంటించారు. ఇంకేం ఉంది? చంద్రుడు కాస్తా సూర్యుడు అయిపోయాడు. 'సార్... ఇది ఓపెనింగ్ టైమ్' అని కూల్ గా చెప్పారు యంగ్ టైగర్. అందరూ కలిసి చికెన్ తిన్నారు. ఈ సీన్ ఎందులోనిదో తెలుసా? ఎన్టీఆర్ నటించిన కొత్త యాడ్ (NTR McDonald's Commercial)లోనిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఆదిపురుష్' (Adipurush Movie)లో దర్శకుడు ఓం రౌత్ ఏం చూపించారు? సినిమా ఎలా ఉండబోతుంది? వంటి అంశాల కంటే ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేశారు. సినిమా బయట జరిగిన అంశాలు మరింత వివాదాస్పదం అయ్యాయి. ప్రభాస్ గెటప్ నుంచి కృతి సనన్ ఎంపిక వరకు... డిజప్పాయింట్ చేసిన టీజర్ నుంచి అంచనాలు పెంచిన ఫస్ట్ ట్రైలర్, ఇప్పుడు యాక్షన్ ట్రైలర్ వరకు... సినిమాకు సంబంధించిన ప్రతిదీ వార్తల్లో నిలిచింది. టీజర్ విడుదలైన తర్వాత విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శలు రావడంతో ట్రైలర్ విడుదలకు వచ్చే సరికి తప్పుల్ని సరి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. సినిమా ఓం రౌత్ చేతుల్లో లేదు. రన్ టైమ్ లాక్ చేసి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. విదేశాలకు సైతం పంపేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)