News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tamannaah - Rajinikanth : తమన్నాకు రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

రజనీకాంత్ 'జైలర్'లో తమన్నా నటించారు. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు మిల్కీ బ్యూటీకి సూపర్ స్టార్ ఓ గిఫ్ట్ ఇచ్చారట! అది ఏమిటో తెలుసా?

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గారితో నటించాలనేది తన కల అని, అది నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) సంతోషం వ్యక్తం చేశారు. 

రజనీకాంత్ కథానాయకుడిగా 'కొలమావు కోకిల', శివ కార్తికేయన్ 'డాక్టర్', విజయ్  'బీస్ట్' చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). ఆ సినిమాలో తమన్నా కథానాయికగా నటించారు. ఈ మధ్య చిత్రీకరణ పూర్తి అయ్యింది. రజనీతో నటించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు... చిత్రీకరణలో తనకు ఓ బహుమతి కూడా ఇచ్చారని చెప్పారు. 

తమన్నాకు బుక్ ఇచ్చిన రజనీకాంత్!
రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆ విషయం ప్రేక్షకులకూ తెలుసు. ఆయనకు ఖాళీ దొరికితే హిమాలయాలకు వెళతారు. తమన్నాకు సైతం స్పిరిచ్యువల్ జర్నీకి సంబంధించిన బుక్ బహుమతిగా ఇచ్చారట. ఆ పుస్తకం మీద రజనీకాంత్ తన ఆటోగ్రాఫ్ కూడా చేశారని తమన్నా తెలిపారు. అదీ సంగతి!

'జైలర్' కంటే ముందు... ఈ నెలలో రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ ఈ నెల 15న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత ఈ నెలాఖరున (29న) నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 2' స్ట్రీమింగ్ కానుంది. 'జీ కర్దా' ట్రైలర్, 'లస్ట్ స్టోరీస్ 2' టీజర్ చూస్తే... తమన్నా బోల్డ్ సీన్స్ చేసినట్టు అర్థం అవుతోంది.

Also Read శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?
Lust Stories 2 Teaser Review : 'ఓ చిన్న కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా! మరి, పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా?' - 'లస్ట్ స్టోరీస్ 2' టీజర్ ప్రారంభంలో ఓ బామ్మ చెప్పే డైలాగ్! ఇదొక్కటీ చాలు... సిరీస్ ఎలా ఉంటుందో చెప్పడానికి! శృంగార సన్నివేశాలు ఉంటాయని ఒక్క మాటతో స్పష్టం చేశారు. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదన్నట్టు సమర్ధించారు. 

హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్! 
'లస్ట్ స్టోరీస్ 2' మీద సౌత్ ఇండియన్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె బాయ్ ఫ్రెండ్, నాని 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో విలన్ రోల్ చేసిన విజయ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సిరీస్ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఖబర్. టీజర్ చూస్తే... ఇద్దరు బెడ్ మీద ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది. 

'లస్ట్ స్టోరీస్ 2'లో దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షించే మరో కథానాయిక మృణాల్ ఠాకూర్. 'సీతా రామం' సినిమాతో తెలుగు, మలయాళ ప్రేక్షకులల్లో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. తమన్నాతో పాటు మృణాల్ సైతం శృంగార సన్నివేశాలు చేశారట.

Also Read : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ

Published at : 08 Jun 2023 10:38 AM (IST) Tags: Tamannaah Bhatia Rajinikanth Jailer Movie Tamannaah Upcoming Movies Rajini Gifts Tamannaah

ఇవి కూడా చూడండి

Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్

Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!

మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

టాప్ స్టోరీస్

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Siddipet: 60 పైసల కోసం చెక్కు ఇచ్చిన బ్యాంకు, అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Siddipet: 60 పైసల కోసం చెక్కు ఇచ్చిన బ్యాంకు, అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!