News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kriti Sanon Tirumala Controversy : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

తిరుమలలో హీరోయిన్ కృతిని కౌగిలించుకున్న దర్శకుడు ఓం రౌత్, ఆమెకు ముద్దు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఈ ఘటనపై స్పందించారు.

FOLLOW US: 
Share:

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy) దర్శనం అనంతరం... ఆలయం వెలుపల కథానాయిక కృతి సనన్ (Kriti Sanon)కి ఓం రౌత్ (Om Raut) ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ (Chilkur Balaji temple priest CS Rangarajan) స్పందించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల కొండపై ఆ పనులు సమ్మతం కాదు!
''తిరుమల కొండపైన 'ఆదిపురుష్' చిత్ర బృందం దర్శనానికి వెళ్ళారు. సంతోషం! స్వామి వారి దర్శనం అనంతరం సీతమ్మ పాత్ర పోషించిన అమ్మాయి, దర్శకుడు బయటకు వచ్చారు. స్వామి వారి శేష వస్త్రం ధరించి కౌగిలి, చుంబనం! అది మనసుకు ఆందోళన కలిగించే విషయం. తిరుమల కొండపైన ఇటువంటి వికారమైన చేష్టలు చేయకూడదు. సమ్మతం కాదు'' అని సీఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుమల కొండపై కొన్ని నియమాలు పాటించాలని సీఎస్ రంగరాజన్ సూచన చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''భక్తి, ఆలోచన నియమాలు ఉండాలి. స్వామి వారి తిరుమల కొండకు భార్యాభర్తలు కలిసి వచ్చినా సరే... కళ్యాణోత్సవంలో పాల్గొన్నా కూడా... ఆలోచనా విధానంలో జాగ్రత్త పడతారు. వేరే వికారమైన ఆలోచన రాకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. అటువంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగలించుకుని, చుంబనం చేయడం దారుణమైన కార్యక్రమం. సాధారణంగా ఇటువంటి విషయాలు మాట్లాడాలని నేను టీవీ ఛానల్స్ ముందుకు రాను. కానీ, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావుడు రాములు వారి పాత్ర పోషించినప్పుడు వాళ్ళను దైవ సమానులుగా ప్రేక్షకులు చూశారు. వాళ్ళూ అంతే భక్తి శ్రద్దలతో ఉన్నారు. ఆ విధంగా నడుచుకోవాలి.  సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు'' అని అన్నారు. 

తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తామని, అటువంటి ప్రదేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్న చోట అటువంటి పనులు (ముద్దులు, హగ్గులు) ఏమిటని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పనులు సీతారాములను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. 

తిరుమలలో అసలు ఏం జరిగింది?
దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లబోతున్న కృతి సనన్ వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో... ఆమె దగ్గరకు ఓం రౌత్ మళ్ళీ వచ్చారు. టాటా చెప్పారు. అక్కడి వరకు ఒకే. అయితే... కృతిని హగ్ చేసుకున్న ఓం రౌత్, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. 'గాడ్ బ్లెస్ యూ' (దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. స్వామి వారి భక్తులకు ఆది కోపాన్ని తెప్పిస్తోంది.

Also Read : 10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

చిత్రసీమలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటా బైబై చెప్పడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ అది. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో సర్వ సాధారణం. కానీ, తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీసిన ఓం రౌత్ ఉద్దేశపూర్వకంగా  ఆ పని చేసి ఉండకపోవచ్చు. ఆయనకు భక్తి శ్రద్ధలు ఎక్కువే. అయితే, తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు.

Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రియాంక చోప్రా?

Published at : 08 Jun 2023 08:46 AM (IST) Tags: Kriti Sanon Tirumala Tirupati Devasthanam Om Raut Chilkur Balaji Temple CS Rangarajan Kriti Tirumala Controversy

ఇవి కూడా చూడండి

దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !