NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ
Balakrishna's NBK 108 Titled As Bhagavanth Kesari - It's Official : అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి'గా నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
'భగవంత్ కేసరి'... మీరు చదివింది నిజమే! 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie)గా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన పేరు మీరు చదివినదే. సినిమా టైటిల్ కూడా అదే!
బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే?
బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి 'భగవంత్ కేసరి' (NBK 108 Movie - Bhagavanth Kesari) టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. 'ఐ డోంట్ కేర్'... అనేది ఉప శీర్షిక. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా... రెండు రోజుల ముందు టైటిల్ రివీల్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్ అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేశారు.
బాలయ్య బర్త్‌డేకు 'భగవంత్ కేసరి' టీజర్!
Bhagavanth Kesari Teaser : బాలకృష్ణ అభిమానులకు దర్శకుడు అనిల్ రావిపూడి మరో కానుక కూడా సిద్ధం చేశారు. పుట్టినరోజు నాడు 'భగవంత్ కేసరి' టీజర్ విడుదల చేయనున్నారు. విజయ దశమి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా...
బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుంది. ఆయన హీరోగా 'వాల్తేరు వీరయ్య'తో సంక్రాంతికి హిట్ కొట్టిన కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను జూన్ 10న ప్రకటించనున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.
Also Read : 10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఇంతకు ముందు కొన్నిసార్లు ఈ కాంబినేషన్ కొంత మంది దర్శక, నిర్మాతలు పరిశీలనలోకి వచ్చినా సరే... సెట్ కాలేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్నారు. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శ్రీ లీలకు తండ్రి పాత్ర ఆయనది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.
Also Read : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం
రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.