Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఓ కొత్త యాడ్ ఈ రోజు విడుదల అయ్యింది. విశేషం ఏమిటంటే... ఇది కూడా ఫుడ్ యాడ్!
స్నేహితులతో కలిసి చికెన్ తినడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు! అంతలో ఆయన ముందుకు ఓ మేనేజర్ వచ్చారు! 'సార్... సార్... ఇది క్లోజింగ్ టైమ్' అంటూ చేతికి ఉన్న గడియారంలో టైమ్ చూపించాడు. వెంటనే ఎన్టీఆర్ అగ్గిపెట్టె తీసుకుని ఓ స్టిక్ బయటకు తీశారు. అగ్గిపుల్ల వెలిగించారు. చంద్రుడికి అంటించారు. ఇంకేం ఉంది? చంద్రుడు కాస్తా సూర్యుడు అయిపోయాడు. 'సార్... ఇది ఓపెనింగ్ టైమ్' అని కూల్ గా చెప్పారు యంగ్ టైగర్. అందరూ కలిసి చికెన్ తిన్నారు. ఈ సీన్ ఎందులోనిదో తెలుసా? ఎన్టీఆర్ నటించిన కొత్త యాడ్ (NTR McDonald's Commercial)లోనిది.
మెక్ డోనాల్డ్స్ యాడ్ చేసిన ఎన్టీఆర్!
అవును... ఎన్టీఆర్ మెక్ డొనాల్డ్స్ యాడ్ చేశారు. అది ఈ రోజు విడుదల చేశారు. ఆ యాడ్‌లో సన్నివేశాన్నే మీరు పైన చదివినది. చంద్రుడు సూర్యుడిగా మారే సరికి 'హౌ?' (ఇది ఎలా సాధ్యమైంది?) అని మేనేజర్ ఆశ్చర్యపోతూ... ఆయన కూడా చికెన్ తిన్నారు. యాడ్ చివరలో 'మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్! స్పైసీని మీరు వివరించలేరు... షేర్ చేసుకోవాలి' అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. అదీ సంగతి!
ఎన్టీఆర్ చేసేవన్నీ ఫుడ్ యాడ్స్!?
మెక్ డొనాల్డ్స్ కంటే ముందు ఎన్టీఆర్ చేసిన యాడ్స్‌లో రెండు ప్రముఖమైనవి... లీషియస్, యాపీ ఫిజ్! ఆ రెండూ కూడా ఫుడ్ యాడ్స్ కావడం విశేషం. ఫస్ట్ Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే లీషియస్ కోసం ఓ యాడ్ చేశారు. ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ యాడ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఎక్కువ ఫుడ్ యాడ్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే... ఎన్టీఆర్ ఫుడ్డీ. ఆయన వంట బాగా చేస్తారని ఫ్రెండ్స్ కొందరు చెబుతూ ఉంటారు. ఇంతకు ముందు నవరత్న ఆయిల్ కోసం కూడా ఆయన ఒక యాడ్ చేశారు.
Also Read : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?
'దేవర'తో పాటు లైనులో మరో రెండు
సినిమాలకు వస్తే.... ఇప్పుడు ఎన్టీఆర్ చేతిలో మూడు భారీ పాన్ ఇండియా ఫిల్మ్స్ ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' ముందు వరకు ఓ లెక్క... దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆ సినిమా విడుదల తర్వాత మరో లెక్క! ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కు భారత ప్రేక్షకులలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆయన సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్లు, ఇతర నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో కథానాయికగా శ్రీదేవి కుమార్తె, హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంపికయ్యారు. ప్రతినాయక పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 'దేవర' తర్వాత 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. అందులో కథానాయికగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా పేరు వినబడుతోంది. అది కాకుండా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి 'వార్ 2' చేయనున్నారు.
Also Read : మొన్న 'రానా నాయుడు', నేడు 'సైతాన్' - స్పైసీగా తెలుగు వెబ్ సిరీస్‌లు, బూతులు & బోల్డ్ సీన్లు!