‘తమ్ముడి’ని తలపించిన ‘బ్రో’, అభిమాని మరణంపై స్పందించిన తారక్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘ధీర’గా వస్తున్న అఖిల్ - బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదట!
నాగార్జున వారుసుడుగా వచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు 5 సినిమాలు చేశాడు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అన్నింటికి అన్నీ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. తన రీసెంట్ మూవీ ‘ఏజెంట్’తో సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకున్నా, ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది. పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతుందనే ప్రచారం జరిగినా, అఖిల్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తాం - ఆ సింగర్ హత్య కేసు నిందితుడు వార్నింగ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి హత్యా బెదిరింపులు వచ్చాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోల్డీ బ్రార్, సల్మాన్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ హత్య గురించి కీలక విషయాలు వెల్లడించాడు గోల్డీ బ్రార్. తమ గ్యాంగ్ తప్పకుండా సల్మాన్ ను చంపేస్తుందని తేల్చి చెప్పాడు. "మేము అతడిని(సల్మాన్ ను) చంపుతాం. కచ్చితంగా చంపుతాం. కృష్ణ జింకలు చంపినందుకు భాయ్ సాహెబ్(లారెన్స్ బిష్ణోయ్)కి అతను క్షమాపణ చెప్పాలన్నాం. కానీ, అతడు చెప్పలేదు. బాబాను ఎదిరిస్తే ఏమవుతుందో అతడికి తెలిసేలా చేస్తాం” అని గోల్డీ వార్నింగ్ ఇచ్చాడు. “ ఇది సల్మాన్ ఖాన్ గురించి మాత్రమే హెచ్చరిక కాదు, మేము జీవించి ఉన్నంత వరకు మా శత్రువులందరిపైనా తీవ్ర ప్రతి ఘటన తప్పదు. మా శత్రువుల లిస్టులో సల్మాన్ కూడా ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము కచ్చితంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం” అని తేల్చి చెప్పాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అభిమాని మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్యామ్ మర్డర్ మిస్టరీ
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమాని శ్యామ్ (NTR Fan Shyam) రెండు రోజుల క్రితం మరణించారు. అతడి మృతి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని వినబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను శ్యామ్ మర్డర్ మిస్టరీ షేక్ చేస్తోంది. అభిమాని మృతి విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'తమ్ముడు' కాదు 'బ్రో' - 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్
'తొలి ప్రేమ' రీ రిలీజ్ ట్రైలర్ వేడుకకు నిర్మాత వివేక్ కూచిభొట్ల అతిథిగా వచ్చారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత... అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంత ఎనర్జీతో కనిపించారో, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'బ్రో' సినిమాలో కూడా అంతే ఎనర్జీగా ఉన్నారని ఆయన చెప్పారు. లేటెస్టుగా విడుదలైన స్టిల్ చూస్తే ఆయన మాటలు నిజమేనని చెప్పక తప్పదు! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'సామజవరగమన' సెన్సార్ రిపోర్ట్ - కట్ చేసిన ఆ నాలుగు పదాలు ఏమిటంటే?
సకుటుంబ సపరివార సమేతంగా 'సామాజవరగమన' (Samajavaragamana Movie) చిత్రానికి ప్రేక్షకులు వెళ్ళవచ్చు. యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే... కొన్ని కట్స్ కూడా చెప్పింది. 'సామాజవరగమన' సినిమాలో నాలుగు అంటే నాలుగు పదాలు తొలగించమని చిత్ర బృందానికి సెన్సార్ బోర్డు సూచన చేసింది. అందులో ముఖ్యమైనది... 'దొంగ ము--డ'. ఆ పదంతో పాటు కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్ కూడా తొలగించమని పేర్కొంది. అలాగే... 'సైకో', 'ఇండోనేసియా', 'బెంచోద్' పదాలకు కూడా కత్తెర వేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)