Samajavaragamana Movie : 'సామజవరగమన' సెన్సార్ రిపోర్ట్ - కట్ చేసిన ఆ నాలుగు పదాలు ఏమిటంటే?
Samajavaragamana Censor Cuts List : శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన 'సామజవరగమన' ఈ వారమే థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని కట్స్ కూడా చెప్పింది.
సకుటుంబ సపరివార సమేతంగా 'సామాజవరగమన' (Samajavaragamana Movie) చిత్రానికి ప్రేక్షకులు వెళ్ళవచ్చు. యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే... కొన్ని కట్స్ కూడా చెప్పింది. ఆ కట్స్ ఏమిటో చూడండి.
ఆ నాలుగు ముక్కలకు కత్తెర!
Samajavaragamana Censor Report : 'సామాజవరగమన' సినిమాలో నాలుగు అంటే నాలుగు పదాలు తొలగించమని చిత్ర బృందానికి సెన్సార్ బోర్డు సూచన చేసింది. అందులో ముఖ్యమైనది... 'దొంగ ము--డ'. ఆ పదంతో పాటు కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్ కూడా తొలగించమని పేర్కొంది. అలాగే... 'సైకో', 'ఇండోనేసియా', 'బెంచోద్' పదాలకు కూడా కత్తెర వేసింది. ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల ఇరవై నిమిషాలు (2.20 గంటలు).
నిజం చెప్పాలంటే... ఇటీవల కొన్ని సినిమాల్లో అటువంటి పదాలు వినిపించాయి. వెబ్ సిరీస్, ఓటీటీ సినిమాల్లో అయితే లెక్కకు మిక్కిలి వచ్చాయి. అయితే... ఆ సినిమాలకు క్లీన్ 'యు' సర్టిఫికేట్ రాలేదు. 'సామాజవరగమన'కు క్లీన్ 'యు' ఇవ్వడం కోసం తొలగించారని చెప్పవచ్చు.
ప్రీమియర్ షోలకు మంచి స్పందన!
'సామజవరగమన' సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో కుటుంబ ప్రేక్షకులకు చూపించారు. వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమా అడ్డా హైదరాబాద్ సిటీలో విడుదలకు ఒక్క రోజు ముందు షోలు వేస్తున్నారు. జూన్ 28వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
Also Read : ఫోన్ నంబర్ మార్చేసిన అషు రెడ్డి... న్యూస్ ఛానళ్ళపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
కుటుంబ సభ్యులు అంటే 'కెజిఎఫ్'లో బానిసలా!?
'సామజవరగమన' ట్రైలర్ విడుదలైంది. బాక్సాఫీస్ బాలు పాత్రలో హీరో శ్రీ విష్ణు నటించారు. ఆయనకు తండ్రిగా సీనియర్ నరేష్ కనిపించనున్నారు. రెబ్బా మోనికా జాన్ హీరోయిన్. ''వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే 'కెజిఎఫ్'లో బానిసలు'' అని హీరో క్యారెక్టర్ గురించి తండ్రి చెప్పే డైలాగ్ బావుంది. ఐ లవ్యూ చెప్పిన అమ్మాయిలకు రాఖీలు కట్టే కాన్సెప్ట్ ఏమిటి? ఫ్యామిలీలో అమ్మాయిలు అందరూ లేచిపోవడం ఏమిటి? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది థియేటర్లలో చూడాలి. ఆల్రెడీ విడుదల చేసిన పాటలకు తోడు ఈ ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై నమ్మకాన్ని కలిగించాయి. కామెడీ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ మేళవించి తీసిన ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ (సీనియర్ నరేష్), సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ : భాను బోగవరపు, మాటలు : నందు సవిరిగాన, కూర్పు : ఛోటా కె ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం : రాం రెడ్డి, సంగీతం : గోపీ సుందర్, సహ నిర్మాత : బాలాజీ గుత్తా, సమర్పణ : అనిల్ సుంకర, నిర్మాత : రాజేష్ దండా, కథనం, దర్శకత్వం : రామ్ అబ్బరాజు.