మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక, ఉపాసన డెలివరీ రేపే - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
పాపం, రష్మిక మందన్న - రూ.80 లక్షలతో ఉడాయించిన ఘనుడు!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. తెలుగులో ‘చలో’ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తోన్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా రష్మికకు ఫాలోయింగ్ ఎక్కువే. ఏదొక విషయంలో ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా రష్మిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన మేనేజర్ చేతిలో రష్మిక భారీగా మోసపోయిందట. ఇప్పుడిదే నెట్టింట వైరల్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రిహార్సల్స్ చేసి మరీ లిప్ లాక్ - వైరల్ గా మారిన స్మృతి వెంకట్ ముద్దు సీన్!
స్మృతి వెంకట్. కోలీవుడ్ యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు 10 సినిమాల్లో నటించింది. అయినా, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. స్మృతి 2015లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట్లో హీరోలకు చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై కనిపించింది. ఇప్పటికే పలు సినిమాలు చేసినా, కెరీర్ ను మలుపుతిప్పే హిట్ మాత్రం పడలేదు. సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అలియా, రణ్‌బీర్‌లతో ‘రామాయణం’ మూవీపై ఓం రౌత్ కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. జూన్ 16న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు సినిమా బాగుందంటే, మరికొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇలాగే ఉంటుందా? అంటూ పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ‘ఆదిపురుష్’ సినిమాపై నెగెటివ్ టాక్ నడుస్తున్న నేపథ్యంలోనే మరో దర్శకుడు నితీష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాపై దర్శకుడు ఓం రౌత్ స్పందించడం విశేషం. అంతేకాదు, నితీష్‌కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. రామాయణంపై నితీష్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆలియా సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రేపు ఉపాసన డెలివరీ? షూటింగ్స్ చెర్రీ బ్రేక్ - హింట్ కూడా ఇచ్చేశారు!
టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్-ఉపాసన అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసనకు డెలివరీ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి మెగా అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. మెగా వారసుడి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చెర్రీ-ఉపాసన దంపతులు పెళ్లైన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసనకు డెలివరీ డేట్ కూడా బాగా దగ్గరపడింది, బహుశా రేపే (జూర్ 20న) ఆమెకు డెలివరీ కావచ్చనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కూడా షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అంతేకాదు, ఉపాసన కూడా ఇన్‌స్టా పోస్టుల ద్వారా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారంటూ హింట్ కూడా ఇచ్చింది. దీంతో మెగా వారసుడి కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన కూడా ముందునుంచీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్దేట్ లను ఇస్తూ వస్తోంది. తాజాగా ఓ స్పెషల్ పోస్ట్ చేసింది ఉపాసన. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రాకేష్ మాస్టర్ భౌతిక కాయం చూసి బోరున ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. చివరి చూపు కోసం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ శిష్యుడైన శేఖర్ మాస్టర్ ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)