Upasana: ఉపాసన డెలివరీ డేట్ ఇదే, షూటింగ్స్‌కు చెర్రీ బ్రేక్ - హాస్పిటల్‌కు చేరుకున్న జంట!
మెగా కోడలు ఉపాసన తాజాగా తన సోషల మీడియా ఖాతాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ నుంచి రామ్ చరణ్ దంపతులకు ఓ బహుమతి వచ్చింది. వారికి..
Upasana: టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్-ఉపాసన అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసనకు డెలివరీ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి మెగా అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. మెగా వారసుడి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చెర్రీ-ఉపాసన దంపతులు పెళ్లైన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసనకు డెలివరీ డేట్ కూడా బాగా దగ్గరపడింది, బహుశా రేపే (జూర్ 20న) ఆమెకు డెలివరీ కావచ్చనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కూడా షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
అంతేకాదు, ఉపాసన కూడా ఇన్‌స్టా పోస్టుల ద్వారా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారంటూ హింట్ కూడా ఇచ్చింది. దీంతో మెగా వారసుడి కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాసన కూడా ముందునుంచీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్దేట్ లను ఇస్తూ వస్తోంది. తాజాగా ఓ స్పెషల్ పోస్ట్ చేసింది ఉపాసన. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు.. తాజాగా ఉపాసన, రామ్ చరణ్ కలిసి హాస్పిటల్‌కు చేరుకున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల కల్లా.. ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుందని చెబుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మేం త్వరలో ముగ్గురం కాబోతున్నాం: ఉపాసన
ప్రజ్వల ఫౌండేషన్ పంపిన ఉయ్యాల బహుమతి పోస్ట్ తో పాటు ఉపాసన మరో పోస్ట్ ను కూడా షేర్ చేసింది. అందులో రామ్ చరణ్-ఉపాసన కలసి దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలతో పాటు ఉపాసన ఒక నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘త్వరలో తాము ముగ్గురం కాబోతున్నాం’ అంటూ ఆ పోస్ట లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా వారసుడి కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
The beautiful couple reaches the hospital, as @upasanakonidela is expected to deliver the first child with @AlwaysRamCharan tomorrow. 💕#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/PnKQQC58lt
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 19, 2023
మెగా వారసుడి కోసం స్పెషల్ ఉయ్యాల..
మెగా కోడలు ఉపాసన తాజాగా తన సోషల మీడియా ఖాతాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ నుంచి రామ్ చరణ్ దంపతులకు ఓ బహుమతి వచ్చింది. వారికి పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా ఓ ఉయ్యాలను తయారుచేసి ఉపాసనకు అందజేశారు. ఈ విషయాన్ని ఉపాసన తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఇలాంటి బహుమతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది ఉపాసన. ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా చేతిలో చేసిన ఈ ఉయ్యాల ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పింది. ఇందులో పరివర్తన, ఆత్మగౌరవం కనిపిస్తున్నాయని, తన బిడ్డ కు కూడా అలాంటి విలవలు కలిగి ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొంది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ఈ ఏడాది ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ లో అతిథి పాత్రలో కనిపించాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఆయన నుంచి ఇప్పటి వరకూ సినిమాలు ఏమీ రాలేదు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. పొలిటికల్ డ్రామా బ్యక్డ్రాప్ లో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘ఉప్పెన’ మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా తో కూడా ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇక తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడని టాక్ ఈ వివరాలు అన్నీ త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
View this post on Instagram