అన్వేషించండి

టాలీవుడ్‌పై అవికా షాకింగ్ కామెంట్స్, బన్నీతో గురూజీ కొత్త ప్లాన్ - ఇంకా మరెన్నో టాప్ సినీ విశేషాలు మీ కోసం

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

రోడ్డుపై బిక్షాటన చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్, ఎందుకో తెలుసా?

 సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్-లక్ష్మణ్. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీ గా ఉండే రామ్-లక్ష్మణ్ లు కాస్త విరామం దొరికినా సొంత ఊరికి వెళుతూ ఉంటారు. సొంతూరుకు వెళ్లిన ప్రతీసారి ఊరికి ఏదొక మంచి చేయాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈసారి కూడా తమ సొంతూరుకు వెళ్లారు. అయితే ఈసారి ఓ మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. మనుషుల్లో రోజు రోజుకూ తగ్గిపోతున్న మానవత్వ విలువల్ని తట్టిలేపేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నిర్మాతగా మారనున్న 'ఆదిపురుష్' హీరోయిన్?

బాలీవుడ్ నటి కృతి సనన్, పాన్-ఇండియన్ హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించిన 'ఆదిపురుష్' త్వరలోనే థియేటర్ లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో నిర్మాతగా మారనుందని టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ బాధ్యతలు నిర్వర్తించనున్న ఈ సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్లు, ప్రధాన పాత్రలో నటించే నటీ నటులు, ఇతర నటుల గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారమే గనక నిజం అయితే కృతి సనన్ ను నిర్మాతగా చూడాలనుకునే సినీ ప్రేక్షకులు, కృతి ఫ్యాన్స్ కల నెరవేరినట్టే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బాలీవుడ్ కాదు దక్షిణాదిలోనే నెపోటిజం ఎక్కువ - అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలో తను నటించిన ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటోంది. తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది చిత్రాలపై తన అభిప్రాయం గురించి ఆమె మాట్లాడుతూ నెపోటిజం గురించి కూడా మాట్లాడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

గోపిచంద్ కొత్త సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ - ఫస్ట్ లుక్ పోస్టర్ ఊర మాస్ అంతే!

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను అందుకుంటున్నాడు. గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'రామబాణం' బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 'రామబాణం' ప్లాప్ తో గోపీచంద్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా తన రూట్ మార్చుకుని కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఈసారి కన్నడ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ క్రమంలోనే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆడియన్స్ ఒకింత థ్రిల్ ఫీల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతో తన రూట్ పూర్తిగా మార్చేసాడు గోపీచంద్. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్. కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాకి 'భీమా' అనే టైటిల్ ని ఖరారు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!

'పుష్ప' మానియా ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ (Allu Arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) ల కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. కానీ ఈ సారి వచ్చేది సినిమా కాదు. ఓ అడ్వర్టైజ్ మెంట్ తో. కానీ దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కొందరేమో ఏదైనా షో కోసం ప్లాన్ చేస్తున్నారని అంటే, మరికొందరమో వెబ్ సిరీస్ కోసం జత కట్టనున్నారంటూ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Gokulam Concept | పాడిరైతుల జీవితాలను మార్చే గోకులాలు | ABP DesamKTR Quash Petition Supreme Court | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ | ABP DesamSandeep Reddy Vanga Kite Flying | సంక్రాంతి  సెలబ్రేషన్స్ గట్టిగా చేసిన సందీప్ రెడ్డి వంగా | ABP DesamMahakumbh 2025 Day 2 | హెలికాఫ్టర్లతో భక్తులపై పూలవర్షం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy: ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
ఏపీ ప్రభుత్వం చేపట్టే బనకచర్లపై రేవంత్ పోరుబాట- ముందుగా లేఖలతో మొదలు
Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Srisailam Temple : శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
శ్రీశైలంలో రూ. 100లకే ప్రత్యేక దర్శనం- శివుడి ఆలయంలో బ్యాక్‌డోర్‌ దందా!
Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
ICC Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. బెడ్ రెస్ట్ కు గురైన భారత స్టార్ ప్లేయర్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. బెడ్ రెస్ట్ కు గురైన భారత స్టార్ ప్లేయర్
Nara Lokesh: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Bhopal Constable : కనిపించకుండా పోయిన కరోడ్ పతి కానిస్టేబుల్.. కనిపించని డైరీ.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం
కనిపించకుండా పోయిన కరోడ్ పతి కానిస్టేబుల్.. కనిపించని డైరీ.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం
KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
Embed widget