అన్వేషించండి

Adipurush: నిర్మాతగా మారనున్న 'ఆదిపురుష్' హీరోయిన్?

భారీ బడ్జెట్ ఫిల్మ్ 'ఆదిపురుష్' సినిమాలో నటించిన నటి కృతి సనన్ త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఓ వెబ్ ఫిల్మ్ కి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్, పాన్-ఇండియన్ హీరో, రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించిన 'ఆదిపురుష్' త్వరలోనే థియేటర్ లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో నిర్మాతగా మారనుందని టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ బాధ్యతలు నిర్వర్తించనున్న ఈ సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్లు, ప్రధాన పాత్రలో నటించే నటీ నటులు, ఇతర నటుల గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారమే గనక నిజం అయితే కృతి సనన్ ను నిర్మాతగా చూడాలనుకునే సినీ ప్రేక్షకులు, కృతి ఫ్యాన్స్ కల నెరవేరినట్టే.

ఇక కృతి సనన్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'గణపతి పార్ట్ 1', 'ది క్రూ' సినిమాలతో పాటు ఇంకా పేరు ఖరారు కాని ఓ రొమాంటిక్ కామెడీ-డ్రామాలో నటించనుంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫిల్మ్‘ఆది పురుష్’చిత్రంతో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించింది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 16న రిలీజ్ అవుతుంది.

ఆమె మాట‌ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మోడలింగ్ లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి వాతావరణం, వ్యక్తులు గురించి పెద్దగా తెలియ‌వని, అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ స‌మ‌యంలో ఓ ర్యాంప్ షోలో వాక్ చేసే అవ‌కాశం వ‌చ్చిందన్న ఆమె.. ఆ షోకి వ‌ర్క్ చేసిన కొరియోగ్రాఫ‌ర్ తనను అవ‌మానించ‌ట‌మే కాకుండా, అస‌భ్యంగానూ ప్ర‌వ‌ర్తించాడని వాపోయింది. అది తనకెంతో బాధ‌ను క‌లిగించిందని తెలిపింది. ఆ సంఘటనతో కెరీర్‌నే వ‌దిలేద్దామ‌నుకున్నానని, అప్పుడు అమ్మ‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పానని కృతి తెలిపింది. ప్ర‌తీ చోట ఇలాంటి ఇబ్బందులుంటాయని, వాటిని దాటుకుని వెళ్ళినప్పుడే స‌క్సెస్ వ‌స్తుందని తన తల్లి చెప్పినట్టు కృతి వెల్లడించింది. అప్పుడు ఆమె అలా చెప్పడం వ‌ల్ల‌నే తాను ఇక్క‌డున్నానన్న ఆమె... ఆ మాట‌ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనంటూ కృతి స‌న‌న్‌ వివరించింది.

Read Also : Ari Remake: బాలీవుడ్‌లో మరో సౌత్ మూవీ రీమేక్? "అరి"పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న అభిషేక్ బచ్చన్!

Read Also : AAA Cinemas: హైదరాబాద్ సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్ - మరో వరల్డ్ క్లాస్ థియేటర్ రెడీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget