‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్, ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
శ్రీ లీల 'డేంజర్ పిల్ల' అంటోన్న నితిన్ - ఇది 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సాంగ్
నితిన్ కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఎక్స్‌ట్రా'. ఆర్డినరీ మ్యాన్... అనేది ఉపశీర్షిక. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. ఇందులో శ్రీ లీల కథానాయిక. వీళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రమిది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'బిగ్ బుల్' గా సంజయ్ దత్ - 'కేజీఎఫ్2' ను మించేలా ఫస్ట్ లుక్!
టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, సెన్సేషనల్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల కింద ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమే ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రీసెంట్ గానే బోయపాటి సినిమాని పూర్తి చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కోసం మాస్ మేకోవర్ లోకి మారిపోయాడు. డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ మరింత స్టైలిష్ లుక్ లో మారిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి ఈ సినిమాని ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి
నటుడిగా బిజీగా ఉన్న రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు తన ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియాపై సినిమాలు నిర్మించడంపై దృష్టి సారించాడు. బహుభాషా చిత్రం కోసం తెలుగులో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆయన నటించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు కాంత అనే టైటిల్ ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేయగా.. తాజాగా దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నయా మూవీ గురించి రానా ప్రకటించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'స్లమ్ డాగ్ హజ్బెండ్' రివ్యూ : కుక్కతో పెళ్లి అయితే - సినిమా ఎలా ఉందంటే?
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా నటించిన సినిమా 'స్లమ్ డాగ్ హజ్బెండ్'. బాలనటిగా కొన్ని సినిమాలు, ఆ తర్వాత సీరియళ్లు చేసిన ప్రణవి మానుకొండ (Pranavi manukonda)కు కథానాయికగా తొలి చిత్రమిది. కుక్కతో హీరో పెళ్లి - ఈ కాన్సెప్ట్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'భగవంత్ కేసరి'లో ఓ పాట షూట్ కోసం భారీ సెట్ వేసిన అనిల్ రావిపూడి
'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ సినమాలో బాలయ్య కూతురి పాత్రలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ బాలయ్యతో రొమాన్స్ చేయనుంది. బాలయ్య ఈసారి తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కనిపించనున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా బాలకృష్ణ తన రేంజ్ యాక్టింగ్‌ని ప్రదర్శిస్తాడని చాలా మంది భావిస్తున్నారు. సినిమా కథాంశం బయటకు రాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకూ ఈ విషయంలో సీక్రసీనే మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)