అన్వేషించండి

Danger Pilla Song : శ్రీ లీల 'డేంజర్ పిల్ల' అంటోన్న నితిన్ - ఇది 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సాంగ్

Extra 2023 Movie Songs : నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇందులో ఫస్ట్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నితిన్ (Nithiin) కథానాయకుడిగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఎక్స్‌ట్రా'. ఆర్డినరీ మ్యాన్... అనేది ఉపశీర్షిక. హీరోగా నితిన్ 32వ చిత్రమిది. ఇందులో శ్రీ లీల (Sreeleela) కథానాయిక. వీళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రమిది. 

Extra Ordinary Man 2023 Movie : రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆగస్టు 2న 'డేంజర్ పిల్ల
'Danger Pilla Song : 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'లో మొదటి పాట 'డేంజర్ పిల్ల'ను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. కొంత విరామం తర్వాత ఆయన పని చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. హ్యారిస్ అంటే మెలోడీలకు ఫేమస్. ఈ డేంజర్ పిల్ల సాంగ్ కూడా మెలోడీ అని చిత్ర బృందం తెలిపింది.

Also Read పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?     

ఇటీవల 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో రెండు గెటప్పుల్లో నితిన్ కనిపించారు. కింద కూర్చున్న లుక్కులో మాంచి స్టైలిష్ గా కనపడితే... పైన లుక్కులో గుబురు గడ్డంతో కనిపించారు. ఆ రెండు లుక్కులో ఏది ఎక్స్ట్రా, ఏది ఆర్డినరీ అనేది చూడాలి.
 
డిసెంబర్ 23న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'  
ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయడంతో పాటు 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' విడుదల తేదీని కూడా వెల్లడించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. ఈ సినిమాను మాత్రం శనివారం విడుదలవుతోంది. క్రిస్మస్ 25న కనుక కనుక సెలవులు ఉంటాయి. ఓపెనింగ్స్ విషయంలో ఢోకా అవసరం లేదు. 

Also Read శ్యాంబాబు ఎవరు 'బ్రో' - ఏపీ మంత్రి డ్యాన్స్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్?

ఆల్రెడీ 60 శాతం సినిమా పూర్తి
'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తి అయ్యిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా అని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ప్ర‌స్తుతం చిత్రీక‌రణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందన్నారు. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందని అభిమానులు చెప్పడం సంతోషంగా ఉందని, ఫ్యాన్స్ లుక్ ఎక్సట్రాడినరీగా ఉందన్నారని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ''ఎక్స్‌ట్రా' క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో... 'కిక్' త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రేక్షకులకు రోల‌ర్ కోస్ట‌ర్‌ లాంటి అనుభూతి ఇస్తుంది. న‌వ్విస్తూనే ట్విస్టులతో స‌ర్‌ప్రైజ్‌ చేస్తుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget