అన్వేషించండి

దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి

దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారు. ఆయనెవరో కాదు రానా. అంతే కాదు రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి..

Rana Daggubati for Kaantha : నటుడిగా బిజీగా ఉన్న రానా దగ్గుబాటి కూడా ఇప్పుడు తన ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియాపై సినిమాలు నిర్మించడంపై దృష్టి సారించాడు. బహుభాషా చిత్రం కోసం తెలుగులో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆయన నటించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు కాంత అనే టైటిల్ ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేయగా.. తాజాగా దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నయా మూవీ గురించి రానా ప్రకటించాడు.

‘కాంత’ సినిమా కోసం దుల్కర్, రానా చేతులు కలిపారు. రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’ రెండూ కలిసి ఈ ‘కాంత’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించనుండగా... రానా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు కలిసి నిర్మించే ఈ మూవీ భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఉండనుంది. ద్విభాషా చిత్రంగా రెండు భాషల్లో రానున్న ఈ సినమా షూటింగ్ త్వరలోనే జరగనుంది. కాగా ఈ చిత్రం తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి రానా ప్రకటించి సర్‌ప్రైజ్ చేశాడు.

ఇక 'కాంత' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను కూడా రానా ట్వీట్ చేశాడు. 'నీలా' మూవీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ కోసం ‘హంట్ ఫర్ వీరప్పన్’ అనే డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు సెల్వరాజ్. ఇది నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవనుంది. ఆంగ్ లీ, ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలకు గతంలో సెల్వరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇదిలా ఉండగా 'కాంత' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికొస్తే.. ఇది ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో మిస్టీరియస్ మిషన్ చుట్టూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‍డేట్లు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవలే 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా ఓకే చేసిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఈ సినిమాకు ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‍ను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరో పాన్ ఇండియన్ మూవీని ప్రకటించడం సినీ ప్రియుల్లో జోష్ పెంచుతోంది.

Read Also : 'బ్రో ' సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చిన అకిరా నందన్ - చుట్టుముట్టిన ఫ్యాన్స్, వీడియో వైరల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget