‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్, రవితేజ సరసన పూజా హెగ్డే - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
దసరాకు 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ ఆయుధపూజ - రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి'. విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని గతంలో వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్... ఈ రోజు విడుదల తేదీ వెల్లడించారు. అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి'ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి. బాలకృష్ణ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'బేబీ'లో నటించిన ఆ ముగ్గురి రెమ్యునరేషన్ కలిపినా కోటిన్నర కూడా దాటదా..?
యువ నటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ'.. ఇటీవలే విడుదల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే 'బేబీ' ఏకంగా రూ.7కోట్లు వసూలు చేసింది. రోజురోజుకూ 'బేబీ' కలెక్షన్లు బాక్సీఫీస్ వద్ద మోత మోగిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమాలోని నటీనటుల రెమ్యునరేషన్ పై అందరి దృష్టీ పడింది. ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు వారు ఎంత వసూలు చేశారని అంతా చర్చించుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా..?
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో టాలీవుడ్ పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ ఇటీవలి కాలంలో మాత్రం చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. ముందుతో పోలిస్తే ఇప్పుడు ఆయన సినిమాలను గణనీయంగా తగ్గించేశారు. గత ఐదు సంవత్సరాలలో ఆయన కేవలం మూడు చిత్రాలలో ('PSV గరుడ వేగ', 'కల్కి', 'శేఖర్') మాత్రమే కనిపించాడు. దురదృష్టవశాత్తు, వాటిలో ఒకటి మాత్రమే కమర్షియల్‌గా విజయం సాధించడంతో, రాజశేఖర్ సక్సెస్ రేటు కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో ఆయన చిత్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'జవాన్' సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..
టాలెంటెడ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ కున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో SRK మేక్ఓవర్‌తో పాటు అనిరుద్ BGMలతో ఈ చిత్రం ప్రివ్యూ ఇప్పటికే అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని చోట్లా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న అనిరుద్.. జవాన్ చిత్రానికి సంగీతం అందించినందుకు తీసుకున్న పారితోషికం విలువ తెలిసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. ఆయన రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మాస్ మహారాజాతో బుట్ట బొమ్మ - పూజా హెగ్డేతో సంప్రదింపులు!
మాస్ మహారాజా రవితేజతో బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నారా? వీళ్ళిద్దరి కలయికలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్! హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. 'డాన్ శీను'తో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని... ఆ తర్వాత రవితేజతో 'బలుపు', 'క్రాక్' సినిమాలు చేశారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)