'బేబీ'లో నటించిన ఆ ముగ్గురి రెమ్యునరేషన్ కలిపినా కోటిన్నర కూడా దాటదా..?
సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన బేబీ థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ మూవీకి గానూ వరుసగా రూ.30 లక్షలు, రూ.20లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది
Baby Actors Remuneration : యువ నటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ'.. ఇటీవలే విడుదల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే 'బేబీ' ఏకంగా రూ.7కోట్లు వసూలు చేసింది. రోజురోజుకూ 'బేబీ' కలెక్షన్లు బాక్సీఫీస్ వద్ద మోత మోగిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమాలోని నటీనటుల రెమ్యునరేషన్ పై అందరి దృష్టీ పడింది. ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు వారు ఎంత వసూలు చేశారని అంతా చర్చించుకుంటున్నారు.
ఇక బేబీ మూవీలోని హీరో, హీరోయిన్ల పారితోషికం విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన వైష్ణవి చైతన్యకు రూ.30 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కు రూ.20 లక్షలు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక అత్యంత ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నాడని టాక్. ఈ లెక్కన చూసుకుంటే.. సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణ చైతన్య, విరాజ్ అశ్విన్.. ఈ ముగ్గురి పారితోషికాలను కలిపినా రూ.1కోటిన్నర కూడా లేదని అర్థమవుతోంది.
సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ తో 'బేబీ' సినిమాను రూపొందించినట్టు సమాచారం. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైనా ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రూ.50కోట్ల వరకు వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం. అయితే హీరోయిన్ వైష్ణవి ఫైనాన్షియల్ గా కొన్ని ఇబ్బందులు పడిందని.. అందుకే సినిమా బజ్ తగ్గిన తర్వాత తనకు మరికొంత డబ్బు ఇచ్చే అవకాశం ఉందని ఇటీవల దర్శకుడు సాయి రాజేష్ ప్రమోషన్స్ టైమ్ లో వెల్లడించాడు.
'బేబీ' సినిమాతో మంచి పాపులారిటీ రావడంతో వైష్ణవికి సినిమా అవకాశాలు భారీగానే వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యారు. ఆమె పాత్రను తిడుతూ తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారంటేనే తెలుస్తోంది.. వైష్ణవి క్యారెక్టర్ కు ఆడియెన్స్ కు ఎంత కనెక్ట్ అయ్యారో. ఈ నేపథ్యంలో ఆమెకు బేబీ సినిమా నిర్మించిన సంస్థతోనే మరో రెండు సినిమాలు చేయనుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. మరోపక్క గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా ఛాన్స్ రానుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది.
Read Also : Vishwak Sen: నో అంటే నో అనేది మగాళ్లకూ వర్తిస్తుంది - ఆ దర్శకుడికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial