Vishwak Sen: నో అంటే నో అనేది మగాళ్లకూ వర్తిస్తుంది - ఆ దర్శకుడికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్?
హీరో విశ్వక్ సేన్ సడెన్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. టాలీవుడ్ లో ఓ దర్శకుడిని టార్గెట్ గా చేసుకొనే ఆ పోస్ట్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అది చూసిన నెటిజన్స్. ఆ పోస్ట్
Vishwak Sen: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ హీరో ఇమేజ్ ను దక్కించుకున్నాడు విశ్వక్. కేవలం సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు, చేష్టలు వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. గతంలో కూడా అలా జరిగిన సందర్బాలను చూశాం. అయితే తాజాగా విశ్వక్ సోషల్ మీడియాలో ఒక వెరైటీ పోస్ట్ పెట్టి మరోసారి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. ఈ పోస్ట్ చూసి ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ ను ఉద్దేశించే పెట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
నో అంటే నో అనేది మగాళ్లకూ వర్తిస్తుంది: విశ్వక్ సేన్
గత కొన్ని రోజులుగా సైలెంట్ గానే ఉన్న హీరో విశ్వక్ సేన్ సడెన్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘వద్దు అంటే వద్దు అనేది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. అందుకే హైరానా పడిపోకండి, శాంతియుతంగా ఉండండి. మనం ప్రశాంత వాతావరణంలో బ్రతుకుతున్నాం’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది దీని ఉద్దేశం ఏంటో తెలియక తికమకపడుతుంటే ఇంకొందరు మాత్రం ఈ పోస్ట్ ‘బేబీ’ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ను ఉద్దేశించే పెట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆ హీరో విశ్వక్ సేన్ యేనా?
దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ మూవీ సూపర్ హిట్ అందుకొని థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఇటీవల ఈ మూవీకు సంబంధించిన సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ముందు ‘బేబీ’ కథను ఓ హీరో దగ్గరకు తీసుకెళ్ళామని అన్నారు. ఆ దర్శకుడు అయితే కథ కూడా వినను అని ఆ హీరో అన్నాడని వ్యాఖ్యానించారు. అయితేే ఆ హీరో ఎవరూ అని ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ సేన్ ఈ పోస్ట్ చేయడంతో సాయి రాజేష్ చెప్పిన హీరో విశ్వక్ నే అని అందుకే సాయి రాజేష్ కు కౌంటర్ గా ఈ పోస్ట్ పెట్టారిని కామెంట్లు చేస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ తను ఆ పోస్ట్ దేని గురించి పెట్టాడు అనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ పోస్ట్ పై కొందరు విశ్వక్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంటే మరికొందరు నార్మల్ గా స్పందిస్తున్నారు. మరి దీనిపై దర్శకుడు సాయి రాజేష్ ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బీబీ’ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు రూ.40 కోట్ల వసూళ్ల చేరువలో ఉంది. వారాంతంలో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. ఎస్కేఎస్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మూవీను నిర్మించారు.
"No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023
Also Read: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial