అన్వేషించండి

Kamal Haasan: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!

‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ కోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. 

Kamal Haasan: దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇండియన్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. అందుకోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ హాజరు కాలేదు. అయితే ఆయన ఆన్లైన్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. 

నువ్వు మా అందరికంటే గొప్పోడివి కమల్: అమితాబ్ బచ్చన్

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘మన ప్రేక్షకులు మన సినిమాలకు ఇచ్చే గొప్పతనం ఏంటంటే.. మేము సినిమా కథలను తయారు చేస్తే వాళ్లు హీరోలను తయారు చేస్తారు’’ అని వ్యాఖ్యానించారు. అలాగే అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లాంటి గొప్పనటులతో పాటు ఇక్కడ ప్రేక్షకుల మధ్యలో కూర్చోవడం గొప్ప వరం అని అన్నారు. ఇంతలో అమితాబ్ కలుగజేసుకొని ‘‘మీరు అంత నిరాడంబరంగా ఉండకండి కమల్, వాస్తవానికి మీరు మా అందరికంటే గొప్పవారు’’ అంటూ చమత్కరించారు. దీంతో వేదికపై నవ్వులు విరిశాయి. అమితాబ్ ఇంకా మాట్లాడుతూ.. కమల్ హాసన్ చేసిన సినిమాలు వాస్తవికతను చూపుతాయని, అలాగే ఆయన సినిమాల కోసం ఎంతో కష్టపడతారని అన్నారు. కమల్ హాసన్ లా నటించడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కమల్ తో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు అమితాబ్. 

‘షోలే’ సినిమాను ద్వేషించాను: కమల్ హాసన్

అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ ను ప్రశంశలతో ముంచెత్తారు. అమితాబ్ ఎన్నో గొప్ప సినిమాలు చేశారని సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారని అన్నారు. అమితాబ్ గురించి చెబుతూ.. బిగ్ బీ నటించిన ‘షోలే’ సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కమల్. ‘షోలే’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశానని అన్నారు. ఆ సినిమా చూసిన రాత్రి తాను అసలు నిద్రపోలేదని అన్నారు. ఎందుకంటే ఆ సినిమాను చాలా ద్వేషించాను. ఆ సినిమా తీసిన వ్యక్తిని మరింత ద్వేషించాను. ఓ గొప్ప ఫిల్మ్ మేకర్ తో కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదే విషయాన్ని రమేష్ సిప్పీకు కూడా చెప్పానని అన్నారు. ఆ సినిమాకు పనిచేసిన ఓ టెక్నీషియన్ గా ఆ రోజు రాత్రి తాను నిద్రపోలేదని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సినిమాలను అమితాబ్ ఎన్నో తీశారని, అయితే ఇప్పుడు అమితాబ్ తన సినిమాల గురించి ఇంత గొప్పగా చెబుతారని, ఇలా మాట్లాడతారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ కు ధన్యవాదాలు తెలిపారు కమల్. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: కచ్చితంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget