అన్వేషించండి

Prabhas: కచ్చితంగా రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్

ఇటీవల అమెరికాలో జరిగిన కామిక్ కామ్ ఈవెంట్ లో పాల్గొంది ‘కల్కి 2898 ఏడీ’ మూవీ టీమ్. ఈ సందర్భంగా ప్రభాస్ రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Prabhas: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ గ్లింప్స్ వీడియోను మూవీ టీమ్ అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కచ్చితంగా రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తా: ప్రభాస్

ఈ కార్యక్రమంలో ఆడియన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ప్రభాస్. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ ల గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. భారత్ లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ పాటకు ఆస్కార్ రావడం మన దేశానికి దక్కిన గౌరవం అని అన్నారు. అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడారు ప్రభాస్. రామ్ చరణ్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఎప్పటికైనా రామ్ చరణ్ తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం అని వ్యాఖ్యానించారు. 

ఖుషీ అవుతోన్న రెబల్ స్టార్, మెగా ఫ్యాన్స్..

కామిక్ కాన్‌లో రామ్ చరణ్‌పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలకు రెబల్ స్టార్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి ప్రభాస్ గెస్ట్ గా వచ్చినపుడు రామ్ చరణ్ ఫోన్ లో ప్రభాస్ ను ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు ప్రభాస్, రామ్ చరణ్ ల స్నేహబంధం గురించి అర్థమవుతుంది. తాజాగా ప్రభాస్, రామ్ చరణ్ తో కలసి సినిమా చేస్తానని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్ లో ఉంటుందంటూ మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు. 

బ్లూ స్క్రీన్ కాస్త బోర్ కొట్టింది: ప్రభాస్

అలాగే ‘ప్రాజెక్ట్ కె’ గురించి అడిగిన ప్రశ్నలకూ సమాధానాలు చెప్పారు ప్రభాస్. ఈ నేపథ్యంలో కొందరు ప్రభాస్ ను మూవీ షూటింగ్ లో బ్లూ స్క్రీన్ గురించి ఓ ప్రశ్న అడిగారు. ‘‘మీరు బాహుబలి, ఆదిపురుష్, సాహో, సాలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు ఇందులో రియల్ సెట్స్ కంటే బ్లూ స్క్రీన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా బ్లూ స్క్రీన్ పట్ల బోర్ కొట్టిందా?’’ అని ప్రశ్నించారు. అయితే దానికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘అవును మొదట్లో నాకు కూడా బోర్ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్ ముందు నేను చిన్నగా కనిపించేవాడ్ని. అయితే గ్లింప్స్ చూసిన తర్వాత బాగానే అనిపిస్తుంది’’ అని సరదాగా సమాధానం చెప్పారు. దీంతో వేదికపై నవ్వులు విరిశాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సమాధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  

Also Read: చిరు లీక్స్ కంటే డేంజర్ - అల్లు అర్జున్ నోట 'పుష్ప 2' డైలాగ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget