‘జవాన్’పై విజయ్ సేతుపతి కామెంట్స్, హరిహర వీరమల్లు అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అందుకే ‘జవాన్’లో నటిస్తున్నా, డబ్బులు ఇవ్వకపోయినా చేసేవాడిని: విజయ్ సేతుపతి
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జవాన్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అభిమానులను అలరించాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఓ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ సినిమా గురించి విజయ్ సేతుపతి కీలక విషయాలు వెల్లడించారు. అసలు తను ఈ సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించారు. ఈ చిత్రం ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఓ స్పెషల్ రీజన్ తోనే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలిపారు. నిజానికి ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా నటించే వాడినని చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్: ఆ ఫోటో షేర్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన నిధి అగర్వాల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడాకిల్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొదటి పీరియాడికల్ మూవీ కాబట్టి పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూవీలో షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో తీసిన ఫస్ట్ షాట్ ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రాసుకొచ్చిందీ బ్యూటీ. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సస్పెన్స్ రివీల్ చేసిన ఇలియానా - ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్‌ను చూపించేసిందిగా!
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా.. కొన్ని రోజుల క్రితమే తాను గర్భవతిని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న పలు ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. అయితే తాను ప్రెగ్నెంట్ అన్న సంగతి చెప్పింది కానీ తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఆ వ్యక్తి ఎవరంటూ ఇలియానాను ప్రశ్నలతో ముంచెత్తారు. తాజాగా ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చేసింది ఇలియానా. ఎట్టకేలకు అతడి ఫొటోను తన అభిమానులతో పంచుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మళ్లీనా మహేష్ బాబు? ఇలాగైతే ‘గుంటూరు కారం’ ఎప్పటికి పూర్తవుతుందో!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమాను చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూలన్ ను ప్రారంభించారు. అయితే మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మాత్రం ఎక్కువగానే టైమ్ కేటాయిస్తూ ఉంటారు. షూటింగ్ కు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళ్తుంటారు. ఒక్కోసారి సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి మరీ ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు మహేష్. మహేష్ ఇప్పుడు మరో టూర్ కు వెళ్లనున్నారట. అందుకోసం మూవీ షూటింగ్ కు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వనున్నారని టాక్. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పలు చిత్రాలకు సైన్ చేసిన ఆయన.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మాస్ చిత్రానికి ‘గబ్బర్ సింగ్’తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ కాగా, తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు మొలవుతుందా? అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు పవన్.. 'వారాహి యాత్ర'తో బిజీగా ఉండగా.. రీసెంట్ గా ఆయన మరో సినిమా ‘OG’కి ఎక్కువ సమయం ఇస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పై ఎలాంటి క్లారిటీ లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)