సస్పెన్స్ రివీల్ చేసిన ఇలియానా - ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్‌ను చూపించేసిందిగా!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా రీసెంట్ డేస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులూ తనకు కాబోయే భర్త ఎవరన్న దానిపై సస్పెన్స్ ను రివీల్ చేస్తూ తాజాగా కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది
Ileana D’Cruz : గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా.. కొన్ని రోజుల క్రితమే తాను గర్భవతిని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంగా బేబీ బంప్ తో ఉన్న పలు ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. అయితే తాను ప్రెగ్నెంట్ అన్న సంగతి చెప్పింది కానీ తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఆ వ్యక్తి ఎవరంటూ ఇలియానాను ప్రశ్నలతో ముంచెత్తారు. తాజాగా ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చేసింది ఇలియానా. ఎట్టకేలకు అతడి ఫొటోను తన అభిమానులతో పంచుకుంది.
ఫొటోలో ఉన్న ఇలియానా బాయ్ బ్లాక్ షర్ట్‌లో గడ్డంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కానీ అతని పేరు గానీ, ఏం చేస్తుంటాడన్న విషయాలు మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ లోనూ ఉంచింది ఈ భామ. ఇలియానా గర్భం దాల్చిన విషయాన్ని స్వయంగా ప్రకటించగా.. అయితే ఆమె నిజంగానే గర్భం దాల్చిందా లేక సరోగసీ ద్వారా తల్లి కాబోతోందా అంటూ చాలామంది అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు.
ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఈమధ్య తన బేబీ బంప్ కనిపించేలా కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. రీసెంట్ గా తనకు తొమ్మిదితో నెల రావడంతో.. తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ‘‘ప్రస్తుతం తొమ్మిదో నెల నడుస్తోంది. ఈ గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నా. ఒంట్లో ఎంతో నీరసంగా ఉంది’’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అంతకుముందు కూడా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన బేబీ హార్ట్ బీట్ తొలిసారి విన్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపింది. ఆ హార్ట్ బీట్ విన్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని తెలిపింది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సహజం అన్న ఆమె.. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పింది.
‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అందులో భాగంగా ప్రిన్స్ మహేష్ బాబు, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. అలా హిందీ సినిమాలపైనా కన్నేసిన ఇలియానా.. అక్కడ కూడా అదరగొట్టింది. 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది. ప్రస్తుతం సినిమాలేం చేయకపోయినా.. ఇటీవలి కాలంలో ఆమె ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
Read Also : 'బేబీ' మూవీకి డైరెక్టర్ రాఘవేంద్రరావు రివ్యూ - ఆయనకు ఏం నచ్చాయంటే..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial