అన్వేషించండి

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్ కావాలన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ వినియోగించుకొని స్మార్ట్ వర్క్‌తో మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు.

AP CM Chandra Babu: రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల్లోని కీలక అధికారులతో సిఎం చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరం సందర్భంగా ముచ్చటించారు. రోజువారీ సమీక్షలకు భిన్నంగా అధికారులతో మాటామంతీ జరిపారు. తన ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలు వివరించిన సిఎం.... అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిఎస్, డీజీపీ, సిఎంవో అధికారులుసహా వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు.

కొత్త ఉత్సాహంతో పని చేద్దాం: చంద్రబాబు

కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం అంటూ అధికారులను ప్రోత్సహించారు చంద్రబాబు. మనమంతా ఒక టీం.. కలిసి పనిచేద్దాం.. ప్రజల జీవితాలు మారుద్దాం అని వారికి పిలుపునిచ్చారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే అద్బుత ఫలితాలు వస్తాయని సూచించారు. ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సిఎం చంద్రబాబు అన్నారు. వివిధ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి తన అనుభవాలను గుర్తుచేసి వారిలో ఉత్సాహం నింపారు. 2025 సంవత్సరం లక్ష్యాలు ఏంటి, పనితీరు ఎలా ఉండాలనేది వివరించారు. ప్రతి శాఖ రిజల్ట్ ఓరియంటెడ్‌గా పని చేయాలన్నారు.  

విమర్శలు వచ్చినా ముందుకెళ్లా: చంద్రబాబు

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ...."ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు అంటే పేదలకు వ్యతిరేకం అనే ప్రచారం ఉండేది. కానీ నాడు ధైర్యంగా సంస్కరణలు అమలు చేశాం. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కూడా సంస్కరణలు మొదలుపెట్టాం. నేషనల్ హైవేల విషయంలో నాడు తీసుకున్న నిర్ణయంతో స్వర్ణచతుర్భుజి రోడ్లు వచ్చాయి. ఓపెన్ స్కై పాలసీ వల్ల విమానయాన రంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. పిపిపి విధానం వల్ల సంపద సృష్టి జరిగింది. నాడు హైదరాబాద్‌లో చేసిన ప్రతి అభివృద్ది నేడు అద్బుత ఫలితాలను ఇస్తోంది’’ అని సిఎం చంద్రబాబు అన్నారు. వివిధ నిర్ణయాల తీసుకునే సమయంలో ఎదుర్కొన్న విమర్శలను కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయినా మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఫలితాలు వచ్చాయని అన్నారు. 

కంటిన్యూ అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది: చంద్రబాబు

విభజన తర‌్వాత ఏపిలో పెద్దఎత్తున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. "2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రం ఎంతో పురోగతి సాధించేది. రాష్ట్రాల అభివృద్దిలో సుస్థిర ప్రభుత్వం అనేది కూడా ముఖ్యం. అప్పుడే అనుకున్న విధంగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది”అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. " 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగు లేని తీర్పు నిచ్చారు. ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. వీటిని నెరవేర్చే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, పాలసీలు తెచ్చాం. ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం. మనకున్న పేరుతో, కొత్తపాలసీతో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ అన్నాం...ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ అంటున్నాం. దీనికి అనుగుణంగా సమస్త అధికార యంత్రాంగం పనిచేయాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు. 

ప్రతి ఇల్లు జియోట్యాగింగ్: చంద్రబాబు

“రాష్ట్రం ఉన్నపరిస్థితుల నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరగా ఫలితాలు రాబట్టాలి. టెక్నాలజీ సాయంతో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి శాఖలో టెక్నాలజీ వాడకాన్ని పెంచాలి. రానున్న రోజుల్లో 150 సర్వీసులు వాట్సాప్ ద్వారా ఇవ్వనున్నాం. దీనికి సమాయత్తం కావాలి. ఆధార్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తాం. ప్రతి ఇల్లు జియో ట్యాగ్ చేస్తాం. పింఛన్లు ఇంటి వద్దనే ఇచ్చారా లేదా అనేది రియల్ టైంలో తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సిసి కెమెరాలు, డ్రోన్లు, రియల్ టైం డాటాను సమర్థవంతంగా వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. 

స్మార్ట్ వర్క్ చేయండి: చంద్రబాబు

రెవెన్యూ శాఖలో చాలా సమస్యలున్నాయి. వీటన్నింటికి పరిష్కారం చూపాలి. రాత్రింబవళ్లు పనిచేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ వర్క్ చేయండి. టెక్నాలజీని వాడండి కచ్చితంగా ఫలితాలు వస్తాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తెలిపారు. "ప్రజలకు 5 ఏళ్ల కాలంలో ఏం చేయాలి అని మాత్రమే కాదు... భవిష్యత్ అవసరాలను గుర్తించి విజన్ 2047ను తీసువచ్చాం. ఇందులో పేర్కొన్న 10 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృష్టిచేయాలి. అన్ని కార్యక్రమాలకు డబ్బుతోనే కాదు... కొత్త ఆలోచనలతో కొత్త మార్గాల్లో ప్రయాణం చేయాలి. మంచి చేయాలనే తపన, ఆలోచన ఉంటే చాలా అంశాల్లో ప్రజలకు మేలు చేయవచ్చు. 2025 సంవత్సరం ఆ తరహా ఆలోచనలకు వేదిక కావాలని కోరుకుంటున్నా. 2025 గేమ్ చేంజర్‌లో కీలకం కావాలి. అతిపెద్ద మార్పుకు ఈ ఏడాదిలో నాంది పడాలి” అని సిఎం అన్నారు.

అన్నింటికీ డబ్బుతో పరిష్కారం చూపలేం: చంద్రబాబు

"రూ. 80 వేల కోట్లతో గోదావరి నీళ్లు బనకచర్లకు సాధ్యమా అని అడుగుతున్నారు. అర్థికంగా అతి పెద్ద ప్రాజెక్ట్.. అయినా సరే దీన్ని చేపట్టాలి. ఇది రాష్ట్ర దశ దిశ మారుస్తుంది. ఇప్పుడు చేపట్టకపోతే ఈ ప్రాజెక్టును ఇక ఎప్పటికీ చేపట్టలేం. ఇవన్నీ ప్రజల జీవితాల్లో నేరుగా మార్పులు తెచ్చే కార్యక్రమాలు "అని సిఎం అన్నారు. "నేను మీ నుంచి వినూత్న ఆలోచనలు కోరుకుంటున్నా. 1995లో మా దగ్గర డబ్బు లేదు. కానీ ఆలోచనలతో మార్పు తెచ్చాం. అధికారులు సరికొత్త ఆలోచనలతో పనిచేస్తే ఫలితాలు వస్తాయి. కలిసి సమిష్టిగా, వేగంగా అడుగులు వేద్దాం. మనం ఎంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తే అంత త్వరగా ఫలితాలు వస్తాయి "అని సిఎం అన్నారు. 

అధికారుల సూచనలకు ఓకే 

ఈ సందర్భంగా పాలనా అంశాలపై అధికారులు కొందరు తమ అభిప్రాయాలు చెప్పారు. అతి పెద్ద పెట్టుబడులు పెట్టే సంస్థల కార్యకలాపాలు వేగంగా కార్యరూపం దాల్చడం కోసం ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలని సూచించారు. ఈ సూచనను సిఎం స్వాగతించారు. ఆయా శాఖలకు సంబంధం ఉన్న పెద్ద పెద్ద సంస్థలు సిఎస్ఆర్ కోసం నిధులు ఖర్చు చేస్తాయని... వాటిని ఒక గొడుగు కిందకు తెచ్చి మంచి ఫలితాలు వచ్చేలా వాటిని ఖర్చు చేసేలా చూడాలని సూచించారు. దీనికి కూడా సిఎం అంగీకారం తెలిపారు. 2025 మార్పునకు, వేగానికి, పాలనను కొత్త పుంతలు తొక్కించడానికి, ప్రజల సంతృప్తిని పెంచడానికి వేదిక కావాలని... ఆ దిశగ అన్ని స్ధాయిల్లో సిబ్బంది, అధికారులు, పనిచేయాలని సిఎం కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
AP In WEF 2025: దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
Embed widget