By: ABP Desam | Updated at : 17 Jul 2023 10:25 AM (IST)
బేబీ(Image Credits : Raghavendra Rao/Twitter)
Raghavendra Rao on Baby Movie: యువ నటుడు ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా, సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించగా.. విరాజ్ అశ్విన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ముందు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ మూవీని వీక్షించారు. అనంతరం టీమ్ మొత్తం కలిసి మంచి సినిమాను అందించారని అభినందించారు.
'జగదీక వీరుడు అతిలోక సుందరి', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'ఘరానా మొగుడు', 'హిమ్మత్‌వాలా' వంటి 100కు పైగా చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రరావు తెలుగు చిత్రసీమలోని ప్రముఖులలో ఒకరుగా చెప్పవచ్చు. అంతటి గ్రేట్ బ్యాగ్రౌండ్ ఉన్న దర్శకుడు... ఇటీవలే 'బేబీ' సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. “బేబీ సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు సాయి రాజేష్ చక్కగా రాసి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ అద్భుతంగా నటించారు. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్" అంటూ ఆయన ట్వీట్ లో రాసుకువచ్చారు.
ఇక రాఘవేంద్రరావు చేసిన ట్వీట్‌కు చిత్ర దర్శకుడు సాయి రాజేష్ బదులిచ్చారు. "నాకు పెద్ద ఇన్స్పిరేషన్ మీరు.. మీ 'ఘరానా మొగుడు' సినిమా చూసే దర్శకత్వం మీద ఆసక్తి పెంచుకున్నాను. నా 'బేబీ' సినిమా మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు.
Watched #babymovie, thoroughly enjoyed it..!
Well written and directed by #SaiRajesh
Amazing performances by #ananddevarakonda, #vaishnavichaitanya #viraj Ashwin, Mind blowing music and back ground score. pic.twitter.com/0N1ruTI1yk— Raghavendra Rao K (@Ragavendraraoba) July 16, 2023
ఇక 'బేబీ' మూవీ విషయానికి వస్తే.. విడుదలకు ముందే.. సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14న రిలీజై మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. 'బేబీ' మూవీని మాస్ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఈ చిత్రంలో నాగబాబు, లిరీషా, కుసుమ, సాత్విక్ ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సోల్‌ఫుల్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. 'బేబీ'ని ఎస్‌కెఎన్ నిర్మించగా.. ధీరజ్ మోగినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Animal Review - యానిమల్ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
/body>