అన్వేషించండి

‘OMG 2’ Controversy: ‘OMG 2’లో స్వలింగ సంపర్కం సీన్స్‌ ఉన్నాయా? మూవీ టీమ్ సెన్సార్ బోర్డ్‌కు ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘ఓఎంజీ 2’ లో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. అయన ప్రస్తుతం ‘OMG 2’లో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  గత కొంత కాలంగా అక్షయ్ కుమార్ నటిస్తోన్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.   

ఆ వార్తలన్నీ అవాస్తవాలేనా?

త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ‘OMG 2’ సినిమాపై పలు ఊహాగానాలు వినిపించాయి. ‘ఆదిపురుష్’ వివాదం నేపథ్యంలో, మతపరమైన అంశాలతో కూడిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని అధికారులు భావిస్తున్నారు. ఈ సినిమా కంటెంట్‌ను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. స్క్రూటినీ ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరకరమైన సంభాషణలు, విజువల్స్ లేకుండా చూసుకోవడానికి నిపుణుల బృందం చర్యలు తీసుకుంటోంది. అయితే, ‘OMG 2’లో పంకజ్ త్రిపాఠి ఒక స్వలింగ సంపర్క విద్యార్థి ఆత్మహత్య తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించే కళాశాల లెక్చరర్‌గా నటించారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తాజాగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో స్వలింగ సంపర్కుల అంశం లేదని చిత్రబృందం కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. 

‘OMG’ సీక్వెల్ గా ‘OMG 2’

అక్షయ్ కుమార్ 2012లో నటించిన ‘OMG’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇది ఒక సెటైరికల్ కామెడీ డ్రామా మూవీ. ఇందులో అక్షయ్ కృష్ణ వాసుదేవ్ యాదవ్ పాత్రను పోషించాడు. ఈ మూవీలో ఆయన కృష్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ‘OMG2’తో ఆ సినిమాకు సీక్వెల్ ను తీసుకురానున్నారు మేకర్స్. అమిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపిస్తోన్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ పై భారీ అంచానలే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ షూటింగు పార్టును పూర్తిచేసుకుని, మిగతా పనుల్లో బిజీ అయింది. అక్షయ్ కుమార్, అశ్విన్ వర్దే కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఆగష్టు 11 న విడుదల

అక్షయ్ కుమార్ నటించిన ఈ ‘OMG2’ ఆగస్టు 11న విడదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ అలాగే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలు కూడా  అదే తేదీన విడుదల కానున్నాయి.  

Read Also: కన్నీళ్లు ఆగలేదు - విజయ్‌తో కలిసి ‘బేబీ’ మూవీ చూశాక రష్మిక స్పందన ఇదీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget