Rashmika Mandanna: కన్నీళ్లు ఆగలేదు - విజయ్‌తో కలిసి ‘బేబీ’ మూవీ చూశాక రష్మిక స్పందన ఇదీ!
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. తాజాగా ఈ సినిమా చూసిన రష్మిక మందన్న ఎమోషన్ అయ్యింది. ఈ మేరకు తన రివ్యూను పంచుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం తాజాగా(జూలై 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.'కలర్ ఫోటో' లాంటి నేషనల్ అవార్డు అందుకున్న మూవీకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిజానికి విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడంతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది.
సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా- రష్మిక మందన్న
తాజాగా ‘బేబీ’ సినిమాకు సంబంధించి రష్మిక మందన్న కీలక విషయాలు వెల్లడించింది. సినిమా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ ను సోషల్ మీడియా వేదికగా వివరించే ప్రయత్నం చేసింది. ఆనంద్ దేవరకొండ మూవీపై ప్రశంసలకు కురిపించింది. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ‘బేబీ’ సినిమాను చూసిన రష్మిక, మూవీపై తన రివ్యూను ఇచ్చింది. ఈ సినిమాను చూసినంత సేపు తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. కొన్ని సీన్లు తనను కదిలించాయని వెల్లడించింది. "నేను బేబీ మూవీని చూశాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు పెట్టుకున్నాను. చాలా కాలం పాటు ఈ సినిమాలోని సన్నివేశాలు నా హృదయంలో నిలిచిపోతాయి. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన టీమ్ కు అభినందనలు” అని రష్మిక తన అభిప్రాయాన్ని పంచుకుంది.
స్పెషల్ స్క్రీనింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఓ వీడియోలో రష్మిక ఏకంగా కన్నీళ్లు పెట్టుకుని కనిపించింది. గురువారం(జులై 13) రాత్రి చిత్రబృందం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో సహా పలువురు ప్రముఖులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. రష్మిక బయటకు వెళ్లినప్పుడు కన్నీళ్లతో కనిపించింది.
ఆనంద్, విరాజ్, వైష్ణవి ఏడిపించారు- విజయ్ దేరకొండ
రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తన సమీక్షను పంచుకోగా, విజయ్ దేరకొండ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత పలు కీలక విషయాలు వెల్లడించారు. చిత్రబృందం మీద ప్రశంసలు కురిపించారు “బేబీ సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోను. ముందుగా, ప్రీమియర్‌ని చూడటానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సినిమా లోపల ఆనంద్, విరాజ్, వైష్ణవితో సహా వీళ్లంతా నన్ను ఎమోషనల్ చేసి ఏడిపించేశారు. 3, 4 రోజుల తర్వాత మరో ఈవెంట్‌లో సినిమా గురించి మాట్లాడతాను’’ అన్నారు.
ఓవరాల్ గా యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. నేషనల్ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' సినిమాకి కథ అందించిన సాయి రాజేష్.. ఈసారి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీతో వచ్చాడని చెప్పాలి. ఇందులో ప్రేమించిన అమ్మాయి కోసం పరితమించే ట్రూ లవర్ గా ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వంటి యూట్యూబ్ సిరీస్ లతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. డెబ్యూతోనే అందరినీ ఆకట్టుకుంది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది.
Read Also: ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు, ఆమె పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial