అన్వేషించండి

Mukku Avinash: ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు, ఆమె పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పారంటే?

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లికి గుండెపోటు వచ్చింది. ఆమెకు డాక్టర్లు రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడినట్లు డాక్టర్లు తెలిపారు.

‘జబర్దస్త్‌’ షో కమెడియన్‌ ముక్కు అవినాష్ తల్లి మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లడంలో డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆమెకు పలుమార్లు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. వెంటనే ఆమెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముక్కు అవినాష్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తల్లి ఆరోగ్య సమస్యలకు కారణాలు, అందించిన వైద్యం గురించి పలు వివరాలు వెల్లడించారు.  

గుండెకు స్టంట్లు వేసిన వైద్యులు

ముక్కు అవినాష్ తల్లి మల్లమ్మ ఊళ్లోనే నివాసం ఉంటున్నారు. అయితే, కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. తరచుగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విషయం తెలిసిన ఆవినాష్ ఆమెను హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. అస్వస్థతకు గురవ్వడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తేలింది. గుండెలో బ్లాక్స్ ఏర్పడినట్లు గుర్తించారు. వాటిని సరిచేసేందుకు వైద్యులు రెండు స్టంట్లు వేశారు.

హ్యాపీగా ఉండే అమ్మ ఇలా అయిపోయింది!

“ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మ ఇలా బాధపడుతోంది. నవ్వు ముఖం మాత్రం ఉండే అమ్మకు ఇప్పుడు ఇలా కావడం బాధ కలిగిస్తోంది. ఆమె చాలా రోజులుగా షుగర్ వ్యాధి ఉంది. దీనికి కారణంగా ఆహారం కూడా సరిగా తినడం లేదు. ఈ మధ్యే అమ్మకు గుండె పోటు కూడా వచ్చింది. ముందు ఊళ్లో టెస్టులు చేయిస్తే గుండె బలహీనంగా ఉందని చెప్పారు. వెంటనే హైదరాబాద్ కు తీసుకొచ్చి పరీక్షలు చేయించాను.  ఆంజియోగ్రామ్ కూడా చేశారు. గుండె సమస్యల కారణంగా స్టంట్లు వేశారు. ఇప్పుడు అమ్మను జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది” అని అవినాష్ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు.

అవినాష్ వల్లే బతికి ఉన్నాను!

అటు తన పరిస్థితిని తలచుకొని అవినాష్ తల్లి తీవ్రంగా కలత చెందుతోంది. తన కొడుకు కారణంగా బతికి ఉన్నట్లు కంటనీరు పెట్టింది. ఇప్పటి వరకు నాకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. కొద్ది రోజులుగా షుగర్ వ్యాధి ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు గుండె పోటు వచ్చింది. నా కొడుకు లేకపోతే, వాడు హైదరాబాద్ లో చికిత్స చేయించి ఉండకపోతే ఇవాళ నేను మీ ముందు ఉండేదాన్ని కాదు. వాడు నన్ను సమయానికి హాస్పిటల్లో చూపించడం వల్లే బతికి ఉన్నాను” అంటూ బాధపడింది. కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన మల్లమ్మ, ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యింది. అవినాష్ దగ్గరే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నది.

ఇక ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు ముక్కు అవినాష్. చక్కటి కామెడీ టైమింగ్ తో మంచి హాస్యం పండించే వాడు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో తర్వాత పలు సినిమాలతో పాటు టీవీ షోలతో ఆకట్టుకుంటున్నాడు.  ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ,  స్టార్ మా విత్ పరివార్స్ లాంటి షోలు చేస్తున్నాడు.

Read Also: నిత్యా మీనన్ ఇంట్లో విషాదం - మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Premante Idera: 'ప్రేమంటే ఇదేరా'లో ఫస్ట్ అనుకున్నది ఐశ్వర్యనా? మరి ప్రీతి జింటా ఎలా వచ్చింది?
'ప్రేమంటే ఇదేరా'లో ఫస్ట్ అనుకున్నది ఐశ్వర్యనా? మరి ప్రీతి జింటా ఎలా వచ్చింది?
Sangeeth Sobhan : సంగీత్ శోభనా... సంతోష్ శోభనా? - రాకాస ఈవెంట్‌లో కన్ఫ్యూజన్ ఫన్నీ మూమెంట్స్
సంగీత్ శోభనా... సంతోష్ శోభనా? - రాకాస ఈవెంట్‌లో కన్ఫ్యూజన్ ఫన్నీ మూమెంట్స్
Ramayana Teaser : రామాయణ టీజర్ - హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్... బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?
రామాయణ టీజర్ - హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్... బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget