By: ABP Desam | Updated at : 16 Jul 2023 03:01 PM (IST)
Image Credit: Nithya Menen/Instagram
Nithya Menen: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నిత్యకు అత్యంత ఇష్టమైన తన అమ్మమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు నిత్యా తెలిపింది. ఈ విషయాన్ని చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నిత్యా ఫ్యాన్స్ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అమ్మమ్మ: నిత్యా మీనన్
ఆ పోస్ట్ లో తన అమ్మమ్మ గురించి చెబుతూ నిత్యా ఇలా రాసుకొచ్చింది.. ‘ఒక శఖం ముగిసింది. మిమ్మల్ని మిస్ అవుతున్నానను, గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. మరో లోకంలో కలుద్దాం’’ అని భావోద్వేగపు పోస్ట్ చేసింది నిత్య. అలాగే తన అమ్మమ్మతో దిగిన ఫోటోను షేర్ చేసింది. అందులో తన అమ్మమ్మ ఒడిలో నిత్యా తలపెట్టుకొని ఉండగా ఆమె ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నట్టు ఆ ఫోటోలో ఉంది. దీని బట్టీ నిత్యాకు తన అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. నిత్యా మీనన్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఇండస్ట్రీకు సంబంధించిన పలువురు సెలబ్రెటీలతో పాటు ఆమె అభిమానులు, నెటిజన్స్ నిత్యాకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది నిత్యా. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిత్యా మీనన్ పేరు చెప్పుకోదగ్గది. కేవలం కళ్లతోనే ఎన్నో రకాల హావభావాలను పలకిస్తుంది నిత్యా. అందుకే ఆమెకే అంత మంది అభిమానులు ఉన్నారు. తన కెరీర్ ప్రారంభంలో కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా నటించిన నిత్య 2011 లో నాని హీరోగా వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇక్కడ వరుసగా ఎన్నో సినిమాల్లో నటించింది.
నిత్యా మీననన్ టాలీవుడ్ లో ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించి యూత్ లో క్రేజ్ పెంచుకుంది. తర్వాత చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్, కథకు బలం ఉన్న పాత్రలూ చేస్తూ వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించింది నిత్యా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ తర్వాత నిత్యాకు తెలుగులో పెద్దగా సినిమాలేమీ రాలేదు. ఆమె నుంచి టాలీవుడ్ లో కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా లేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ సినిమా, తమిళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
/body>