Dayaa Trailer: సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ముగిసినట్టు కాదు - ఉత్కంఠభరితంగా జేడీ, విష్ణుప్రియల ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వస్తోన్న ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగాయి.
Dayaa Trailer: ప్రస్తుత ఓటీటీల కాలంలో వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్ లలో ఎక్కువశాతం ప్రేక్షకులను ఆకర్షించేవి క్రైమ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్లే. ఈ మధ్య కాలంలో అలాంటి వెబ్ సిరీస్లు చాలా వచ్చాయి. అవి ఓటీటీలను లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. అదే ‘దయా’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘దయా’ వెబ్ సిరీస్..
ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే వెబ్ సిరీస్ జోనర్ లలో క్రైమ్ థ్రిల్లర్ లు కూడా ఒకటి. అదే తరహాలో ఇప్పుడీ ‘‘దయా’ వెబ్ సిరీస్ వీక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ లో ‘ఒక అడవి అందులో ఎన్నో ప్రాణులు కానీ కొన్ని గుంట నక్కలు వాటి మీద దారుణంగా విరుచుకుపడుతున్నాయి’’ అనే డైలాగ్ తో కొన్ని అత్యాచార సన్నివేశాలను చూపిస్తూ ట్రైలర్ ను ప్రారంభించారు. తర్వాత ఒక న్యూస్ చానల్ లో లేడీ రిపోర్టర్ మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు చూపించారు. తర్వాత జేడీ చక్రవర్తి పాత్రను పరిచయం చేశారు. జేడీ చక్రవర్తి వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు అతని వ్యాన్ లో డెడ్ బాడీ కనిపిస్తుంది. అక్కడనుంచి కథ మొదలవుతుందని తెలుస్తోంది. మరో వైపు మిస్ అయిన జర్నలిస్ట్ గురించి దర్యాప్తు కొనసాగుతుంటుంది. జేడీ చక్రవర్తి ఆ డెడ్ బాడీను మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సన్నివేశాలను చూపించారు. అసలు ఆ లేడీ రిపోర్టర్ ఎలా మిస్ అయింది. జేడీ చక్రవర్తి వ్యాన్ లో దొరికిన డెడ్ బాడీ ఎవరిది. డెడ్ బాడీ వలన అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి. చివరికి తను ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు వంటివి సిరీస్లో చూడొచ్చు.
ట్రైలర్ చూస్తుంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం సస్పెన్స్ ఆంశాలతో నింపేశారు మేకర్స్. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే విధంగా ట్రైలర్ ను చక్కగా కట్ చేశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయినట్టే కనిపిస్తోంది. ముఖ్యగా ట్రైలర్ లో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించగా ఇషా రెబ్బా, రమ్య నంబీస్సన్, బబ్లూ ఫృద్వీ రాజ్, విష్ణుప్రియ భీమనేని, రవి జోష్, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial